రైలు ఢీకొని తండ్రితో సహా ఇద్దరు కుమార్తెలు మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లా గౌడవెల్లి రైల్వే స్టేషన్ వద్ద జరిగింది. మృతులు రాఘవేంద్రనగర్ కాలనీకి చెందిన ఒకే కుటుంబంగా గుర్తించారు. తండ్రి కృష్ణ రైల్వే లైన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అయితే.. ఈరోజు ఆదివారం సెలవు దినం కావడంతో పిల్లలను వెంట తీసుకుని వెళ్లాడు. తండ్రి కృష్ణ పిల్లలను ట్రాక్‌పై కూర్చోబెట్టి పని చేస్తున్నాడు. ఇంతలోనే ట్రాక్‌పైకి ట్రైన్ రావడంతో పిల్లలను కాపాడబోయాడు. కానీ.. వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు.
Read Also: Sheikh Hasina: ‘‘నా తల్లిని కాపాడినందుకు మోడీకి, భారత్‌కి కృతజ్ఞతలు’’.. షేక్ హసీనా కుమారుడు..
రైల్వే ట్రాక్ పై ముగ్గురి మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మరోవైపు.. తన భర్త, ఇద్దరు పిల్లలను పోగొట్టుకోవడంతో వారి మృతదేహాలను చూసి తల్లి తీవ్రంగా విలపిస్తుంది. ఈ ఘటనను చూసిన స్థానికులు తీవ్రంగా చలించిపోతున్నారు.
Read Also: Twist in Marriage: వరుడు తాళి కట్టే సమయంలో ప్రియురాలి ఎంట్రీ.. చివరకి ఏమైందంటే..?