పల్నాడు జిల్లా నరసరావుపేటలో విషాదం చోటు చేసుకుంది. వినాయక నిమజ్జనానికి వెళ్లి ఇద్దరు పిల్లలు చెరువులో పడి గల్లంతయ్యారు. వారికోసం చెరువులో దిగి గాలింపు చర్యలు చేపట్టగా.. లభ్యమయ్యారు. ఒడ్డుకు తీసుకొచ్చి చూసేసరికి వారు చనిపోయి ఉన్నారు. 24 వార్డుకి చెందిన సంతోష్, వెంకట సుధీర్ అనే ఇద్దరు చిన్నారులుగా గుర్తించారు.
సిక్కింలోని పాక్యోంగ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ వాహనం లోతైన లోయలో పడటంతో నలుగురు సైనికులు వీరమరణం పొందారు. ఆర్మీ వాహనం కఠినమైన పర్వత మార్గంలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పశ్చిమ బెంగాల్‌లోని పెడాంగ్ నుంచి సిక్కింలోని జులుక్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
బీహార్లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి సొంత జిల్లా ముంగేర్ జిల్లాలో 24 గంటల్లోనే దుండుగులు నాలుగు భారీ ఘటనలకు పాల్పడ్డారు. ఈ ఘటనలో బీజేపీ నేతతో సహా ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతుడు బీజేపీ నగర అధ్యక్షుడు ఫంతుష్ కుమార్ అలియాస్ బంటీ సింగ్ గా గుర్తించారు. బీజేపీ నాయకుడు తన కుమారుడితో కలిసి నిద్రిస్తున్న సమయంలో దుండగులు కాల్చారని స్థానికులు చెబుతున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దులోని మార్హ్‌లో భద్రతా బలగాలు-నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. కాగా.. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు ముగ్గురు మహిళా నక్సలైట్లు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు సహా నక్సల్స్ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పిల్లలు, యువకులు, పెద్దలు అనే తేడా లేకుండా గుండెపోటు మరణాలు అందరిలోనూ వస్తున్నాయి. తాజాగా.. యూపీలోని అమ్రోహాలో యూకేజీ (UKG) చదివే చిన్నారి గుండెపోటుకు బలయింది. ఉన్నట్టుండి తరగతి గదిలో అస్వస్థతకు గురి కాగా.. వెంటనే చిన్నారిని గజ్రాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు పరిశీలించి చనిపోయినట్లు ప్రకటించారు.
రష్యాలోని ఓ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఎనిమిది మంది చనిపోయారు. వీరిలో నలుగురు జైలు ఉద్యోగులు కూడా ఉన్నారు. రష్యాలోని వోల్గోగ్రాడ్ ప్రాంతంలోని అత్యంత భద్రత కలిగిన ఐకే-19 సురోవికినో శిక్షాస్మృతి కాలనీలో ఈ హింసాకాండ చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్లో సామూహిక అత్యాచారానికి గురై ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే.. ఈ కేసును ఎఫ్ఐఆర్లో గ్యాంగ్ రేప్ కింద చేర్చడానికి పోలీసులు నిరాకరించారు. దానికి బదులుగా ఆత్మహత్యకు ప్రేరేపించే సెక్షన్లను జోడించారని మృతురాలి తండ్రి చెప్పాడు. దీంతో.. ఈ కేసుపై ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి.
జమ్మూ కాశ్మీర్ లేహ్‌లోని దుర్గుక్ ప్రాంతంలో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు 200 మీటర్ల లోతైన లోయలో పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. మరో 19 మంది గాయపడినట్లు సమాచారం. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
రాఖీ పండగ పూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తన సోదరితో రాఖీ కట్టించుకునేందుకు ఇంటికి వచ్చిన ఓ యువకుడిని దుండగులు హత మార్చారు. ఈ ఘటన ఫరీదాబాద్‌లోని ఆదర్శ్‌నగర్‌లో చోటు చేసుకుంది. బైక్‌పై వచ్చిన దుండగులు.. ఇంట్లోకి చొరబడి ఆర్ఎంపీ డాక్టర్ కొడుకును హత్య చేశారు. దీంతో ఆ ప్రాంతంలో సంచలనం నెలకొంది. మృతి చెందిన వ్యక్తి ఆర్కిటెక్ట్ చదువుతున్న అరుణ్ కుమార్ గా గుర్తించారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్‌లో మళ్లీ ఉగ్రదాడి జరిగింది. ఈ ఉగ్రదాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) అధికారి ఒకరు మరణించారు. కాగా.. ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు సిఆర్పిఎఫ్ జవాన్లు పెట్రోలింగ్ చేస్తుండగా డుడు ప్రాంతంలో ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. దీంతో.. భద్రతా బలగాలు వారికి ధీటుగా కాల్పుల మోత మోగించారు.