ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని నమామి గంగే ప్రాజెక్టు వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. అలకనంద నది ఒడ్డున ఉన్న ప్రాజెక్ట్ సైట్‌లోని ట్రాన్స్‌ఫార్మర్‌లో పేలుడు సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంపై సీఎం పుష్కర్ సింగ్ ధామి విచారణకు ఆదేశించారు.
బెంగాల్‌లోని వివిధ ప్రాంతాల్లో రాళ్లు రువ్వడం, దహనం చేయడంతో పాటు దోపిడీ ఘటనలు జరుగుతున్నాయి. గత రాత్రి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలోని పలు చోట్ల హింసాత్మక ఘటనల్లో 14 మంది మృతి చెందినట్లు సమాచారం.
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అదపు తప్పిన మినీ ట్రక్కు నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా మరి కొంత మంది గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు
టైటానిక్ శిథిలాల వద్దకు పర్యాటకులను తీసుకెళ్తున్న టైటాన్ జలాంతర్గామి పైలట్ భార్య వెండీ రష్.. 1912లో టైటానిక్ షిప్ ప్రమాదంలో మరణించిన దంపతుల మునిమనవరాలు.
చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. బుధవారం రాత్రి రోడ్డు దాటుతున్న ఏనుగుల గుంపు ప్రమాదానికి గురయ్యింది. ఇందులో రెండు గున్న ఏనుగులు, ఒక పెద్ద ఏనుగు మరణించాయి.
బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఈ సంవత్సరం జనవరిలో కనిపించకుండా పోయాడు. అయితే సదరు వ్యక్తి నోయిడాలోని మోమోస్ స్టా్ల్ లో కనిపించాడు. నిశాంత్ కుమార్ అనే వ్యక్తి చనిపోయాడని కుటుంబీకులు అనుకున్నారు. అయితే అతను.. జనవరి 31వ తన అత్తమామల ఇంటికి పెళ్లికి వెళ్తుండగా మిస్సైయ్యాడు.
ప్రసవ సమస్యలతో ఒలింపిక్ గోల్డ్ మెడలిస్టు మరణించింది. అమెరికాకు చెందిన 32 సంవత్సరాల 2016 ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ టోరీ బౌవీ ప్రసవ సమస్యల కారణంగా మరణించినట్టు తన ఏజెంట్ ప్రకటించింది.