ఆర్ఎంపీ వైద్యుడి వైద్యం వికటించి మూడు సంవత్సరాల బాలుడు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మఠంపల్లి మండలం బిల్యానాయక్ తండా చెందిన బానోతు రమేష్ కొడుకు బానోతు శివ తీవ్రంగా జ్వరం ఉండటంతో.. హుజూర్ నగర్ లోని బాబు అనే ఆర్ఎంపి వైద్యుడి వద్దకు బాలుడిని తీసుకువచ్చారు. వెంటనే ఆ బాలుడికి వైద్యం ప్రారంభించిన ఆర్ఎంపి వైద్యుడు ఓ ఇంజక్షన్ ఇచ్చారు. అయితే ఆ ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే చిన్నారి మృతి చెందాడు.
Nithiin: ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ గా నితిన్.. ఆ లుక్ ఏందీ బ్రో..?
ఆర్ఎంపీ వైద్యుడి వైద్యం వికటించి బాలుడు చనిపోయాడని.. ఆర్ఎంపి వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే తమ బాలుడు మృతిచెందాడని కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులకు తోడుగా తండావాసులు, సమీప బంధువులు తరలివచ్చి.. తీవ్ర ఆందోళన చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని బాధితులు ఆర్ఎంపి పై ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.