Odisha Bus Accident: ఒడిషాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 10 మంది మరణించారు. రెండు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో 10 మంది మరణించగా.. మరికొంత మంది గాయాలపాలయ్యారు. ఒడిశాలోని గంజాం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిగపహండి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారు జామున రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. సోమవారం తెల్లవారుజామున గంజాం జిల్లాలోని దిగపహండి సమీపంలో ఒడిశా ఆర్టీసీ బస్సును ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. దీంతో 10 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను బ్రహ్మపురలోని ఎంకేసీజీ (MKCG) ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read also: Tamilnadu : ఘోర రోడ్డు ప్రమాదం.. కారు, బస్సు ఢీ.. ఐదుగురు మృతి..
మృతుల్లో ఎక్కువ మంది ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తున్నవారే ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆర్టీసీ బస్సు రాయ్‌గఢ్ నుంచి భువనేశ్వర్‌కు వెళ్తున్నదని, ఒక పెండ్లి బృందం ప్రైవేటు బస్సులో వెళ్తున్నారని చెప్పారు. రెండు బస్సుల్లో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్న తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 10 మంది మృతి చెందారు. గాయపడిన వారిని వెంటనే MKCG మెడికల్ కాలేజీలో చికిత్స కోసం చేర్పించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. క్షతగాత్రులకు అన్ని విధాలా సాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నామని గంజాం జిల్లా మేజిస్ట్రేట్ దిబ్యా జ్యోతి పరిదా చెప్పారు.
Read also: Ponguleti-Jupally: రాజధానిలో పొంగులేటి, జూపల్లి.. రాహుల్ తో భేటీ
ప్రమాద ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసాయం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షలు ఆర్థికసాయం ప్రకటించారు.