Medchal: వయసు భేదం లేకుండా గుండెపోటుతో ఈ మధ్య కాలంలో చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అప్పటి వరకు ఆనందంగా గడిపిన వాళ్లు కొన్ని క్షణాల్లోనే విగతజీవులవుతున్నారు.
దక్షిణ ఫిలిప్పీన్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 31 మంది మృతి చెందారు. ఫెర్రీలో మంటలు చెలరేగడంతో 31 మంది మరణించారు. 230 మందిని రక్షించినట్లు అధికారులు గురువారం తెలిపారు.
ఓ చిన్నారి ఆడుకుంటోంది. అక్కడ ఐదురుపాయల కాయిన్ కనిపించింది. అయితే ఆ చిన్నారి దానిని స్త నోట్లో వేసుకుంది. దీంతో అస్వస్థతకు గురైంది. గమనించిన తల్లదండ్రులు పసిపాపను వైద్యులు దగ్గరకు తీసుకు వెళ్లారు. వైద్యులు ఆకాయిన్ ను బయటకు తీసిన ప్రయోజనం లేకపోయింది. చివరకు ఆ చిన్నారి ప్రాణాలు వదిలింది. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలోచోటుచేసుకుంది. కాగా.. భూదాన్ పోచంపల్లి పట్టణంలోని వెంకటరమణ కాలనీకి చెందిన బొంగు మహేశ్, సరిత దంపతులకు…
ఇంటి ముందు తల్లి చీరతో కట్టిన ఊయల ఆ చిన్నారికి ఉరితాడైంది. ఊయలతో ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల చిన్నారికి.. చీర మెడకు బిగిసుకుపోవడంతో ఊపిరాడక ఆ చిన్నారి అక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. లాలాపేట్‌కు చెందిన రాజేష్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య ప్రసన్నజ్యోతి కూలి పనులకు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె కోట ఎలీనా (8) శనివారం ఇంటి ముందు తల్లి చీరను…
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కన్నుమూశారు. ఈ విషయాన్ని యూఏఈ అధ్యక్ష వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. షేక్ ఖలీఫా అబుదాబి పాలకుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. షేక్ ఖలీఫా మరణం పట్ల ప్రపంచ దేశాలు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నాయి. భారత ప్రధాని మోదీ కూడా తన సంతాపాన్ని ప్రకటించారు. యూఏఈ రాజ్యాంగం ప్రకారం వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తూమ్,…
కొందరి నిర్లక్ష్యం మరొకరికి ప్రాణ సంకటంగా మారుతోంది. ఇంటిలో ఉన్న సంపు పై కప్పు మూయకపోవడంతో ఓ బాలుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్ పేట్ బషీరాబాద్లో విషాద ఘటన చోటు చేసుకుంది. పేట్ బషీరాబాద్ లోని గుండ్లపోచంపల్లి ఎస్సి కాలనీలోని ఓ ఇంటి ఆవరణలో 2 ఏళ్ళ బాలుడు ఆడుకుంటున్నాడు. అయితే.. ఆ సమయంలో అక్కడే తెరిచి ఉన్న నీటి సంప్లో పడి 2 ఏళ్ల బాలుడు కృష్ణ దాస్ మృతి చెందాడు. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు…
కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. కరోనాతో ప్రముఖ దర్శకుడు ప్రదీప్ రాజ్ కన్నుమూశారు. గత కొన్నిరోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో చికిత్స నిమిత్తం బెంగళూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. గురువారం చికిత్స జరుగుతుండగానే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రదీప్ రాజ్ గత 15 ఏళ్లుగా మధుమేహంతో బాధపడుతున్నారని, దాంతో పాటు ఈ కరోనా కూడా రావడంతో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని, చికిత్సకు ఆయన అవయవాలు సహకరించలేదని…
భార్యభర్తలంటే కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా వుండాలంటారు. జీవితాంతం కలిసి వుంటామని బాసలు చేసుకుంటారు. ఒకరికి కష్టం వస్తే మరొకరు అల్లాడిపోతారు. ఒకరు కన్నుమూస్తే.. మరొకరి గుండె కూడా విశ్రాంతి తీసుకుని వారి దగ్గరే వెళ్ళిపోతుంటుంది. ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. సినిమాల్లో మనం ఇలాంటివి చూసి కన్నీళ్ళు పెట్టుకుంటాం. కానీ గుండెపోటుతో భార్య మృతి చెందిన కాసేపటికే భర్త కన్నుమూసిన ఘటన కన్నీళ్ళు తెప్పించింది. తిరిగి రాని లోకాలకు చేరిన భార్య మృతదేహాన్ని…
తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో నవ దంపతులు మృతిచెందడం ఇరు కుటుంబాలలో తీరని శోకం నెలకొంది. వివరాలలోకి వెళితే.. తమిళనాడులోని అరక్కోణానికి చెందిన మనోజ్ కుమార్ (31)కు, తాంబరం పెరుంగళత్తూరుకు చెందిన కార్తీక(30)కు నాలుగు రోజుల క్రితం అనగా అక్టోబర్ 28న ఘనంగా పెళ్లి జరిగింది. పెళ్లి తరువాత పెరుంగళ్తూరు నుంచి అరక్కోణం నవ దంపతులు కారులో బయలుదేరారు. ముచ్చట్లు చెప్పుకుంటూ, కొత్త జీవితం గురించి మాట్లాడుకుంటూ వస్తున్న ఆ జంట…