హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో అక్కడి జనాలు అతలాకుతలం అవుతున్నారు. గత 24 గంటల్లో వర్షాల కారణంగా 29 మంది మరణించారు.
ఉక్రేయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికీ ఉక్రేయిన్‌లోని పలు పట్టణాలపై రష్యా దాడులు చేస్తుంది. ఉక్రేయిన్‌పై జరుపుతున్న దాడుల్లో భాగంగా రష్యా ఖేర్సన్ పట్టణంపై దాడులు చేసింది.
అమెరికాలోని హవాయి దీవుల్లో చెలరేగిన కార్చిచ్చులో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం వరకే 100 మందికిపైగా మృతి చెందినట్టు అమెరికా అధికారిక వర్గాలు ప్రకటించాయి.
సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రులకు పేదలు వస్తుంటారు. అందులో పెద్ద వయస్సు వారు కూడా ఉంటారు. ప్రభుత్వ ఆసుపత్రులకు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కూడా వస్తుంటారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వధువు చనిపోయింది. సీతానగరం మండలం గుచ్చిమివలస దగ్గర ద్విచక్ర వాహనాన్ని వెనుక నుండి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న భార్యాభర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించే లోపు భార్య కొత్తకోట అమూల్య(29) మృతి చెందింది.
భారీ వర్షాలు, వరదలు ఇండియాతోపాటు పలు దేశాలను ఇబ్బంది పెడుతున్నాయి. రుతుపవనాల ప్రభావం ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వరదలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెట్టాయి.