సెల్ఫీ సరదా పీజీ వైద్యవిద్యార్ధి ప్రాణాలు తీసింది. ఆదివారం శివ్‌ఘాట్ సందర్శనకు వెళ్లి సాత్నాల వాగులో గల్లంతైన ఆదిలాబాద్ రిమ్స్‌లో పీజీ రెండో సంవత్సరం చదువుతున్న ఆర్థోపెడిక్ వైద్యుడు భుక్యా ప్రవీణ్ మృతదేహం లభించింది.
ఏలూరు శ్రీ రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్న విద్యార్థులు మారేడుమిల్లి వద్ద గుడిసె విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన చోటుచేసుకుంది. కారును క్రేన్ సహాయంతో పోలీసులు బయటికి తీశారు. మృతులు ఉదయ్ కిరణ్, హేమంత్, హర్షవర్థన్ అనే విద్యార్థులుగా గుర్తించారు. పదిమంది విద్యార్థులు రెండు కార్లలో విహారయాత్రకు వెళ్లి వస్తుండగా దుర్ఘటన చోటుచేసుకుంది.
ఓ మహిళ ఒక్కరోజులో తాగాల్సిన నీరు ఒకేసారి తాగింది.. ఆ తర్వాత ప్రాణాల మీదకు తెచ్చుకుంది.. ఆ తర్వాత ఇంకేముంది ఆ మహిళ చనిపోయింది. అయితే ఆమే తాగిన నీరు విషపూరితం అని రిపోర్టులో తేలింది.
మధ్య ప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో వరుసగా చీతాలు మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటికే 8 చీతాలు మృతిచెందగా.. తాజాగా మరో చీతా కన్నుమూసింది. ఆ చీతా పేరు ధాత్రి. దాని ఆఫ్రికా నామధేయం తిబ్లిసి. అయితే కునో అభయారణ్యంలో చీతా చనిపోయి ఉండగా అధికారులు ఉదయం గుర్తించారు.
నెల్లూరులో రొట్టెల పండుగకు వచ్చిన గుంటూరుకు చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందారు. పండుగను తిలకించిన వారు తిరిగి తమ స్వస్థలానికి వెళ్లేందుకు.. రైల్వే స్టేషన్ కు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
సబితం జలపాతాన్ని చూసేందుకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు ప్రవాహంలో జారిపడి మృతిచెందాడు. కరీంనగర్ టౌన్ కిసాన్ నగర్కు చెందిన మానుపాటి వెంకటేష్(23), స్నేహితులతో కలిసి జలపాతం సందర్శనకు వచ్చారు. అయితే అక్కడ ప్రమాదవశాత్తు రాళ్లపై జారీ పడటంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇండోనేషియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సులవేసి ద్వీపంలో ప్రమాదవశాత్తు పడవ మునిగి 15 మంది మృతి చెందారు. మరికొందరు గల్లంతైనట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. మొత్తం ఆ పడవలో 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అందులో 19 మంది గల్లంతయ్యారనీ, ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారని ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది.
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. ఈ ఘటన శనివారం రాత్రి మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. వర్షం పడుతుండటంతో బైక్ అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.