Dhruv Jurel Named Central Zone Captain: టీమిండియా వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. దులీప్ ట్రోఫీ 2025 ఆగస్టు 28 నుంచి బెంగళూరులో ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో సెంట్రల్ జోన్ జట్టుకు జురెల్ కెప్టెన్‌గా నియమితులయ్యాడు. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో తన అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన జురెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. సెంట్రల్ జోన్ జట్టులో రజత్ పటీదార్, కుల్దీప్ యాదవ్, దీపక్ చహర్, ఖలీల్ అహ్మద్…
ఇంగ్లండ్- భారత్ మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా 4వ టెస్ట్ మ్యాచ్ జూలై 23న ప్రారంభమైంది. కాగా మాంచెస్టర్ టెస్టు మొదటి రోజు వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ గాయపడిన విషయం తెలిసిందే. పంత్ పాదం చివరి వేలికి ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలో గాయపడ్డ పంత్‌కు ఆరు వారాలు విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారు. అయితే గాయం కారణంగా నాలుగో టెస్ట్…
Rishabh Pant Ruled Out of England vs India Test Series: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గాయపడ్డ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. మాంచెస్టర్ టెస్టులో గాయపడ్డ పంత్‌కు ఆరు వారాలు విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారు. దాంతో నాలుగో టెస్ట్ సహా.. ఐదవ టెస్టుకు సైతం అతడు దూరమయ్యాడు. పంత్ స్థానంలో మరో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్…
Sanju Samson: ఇంగ్లండ్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌కి టీమిండియా ఇంకా తమ జట్టును ప్రకటించలేదు. అంతేకాక, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం కూడా జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ త్వరలో సమావేశం నిర్వహించి జట్టును ప్రకటించే అవకాశముంది. అయితే, ఇంగ్లండ్ సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందే వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌కు ఓ బ్యాడ్ న్యూస్ వచ్చింది. అధికారిక సమాచారం ప్రకారం, విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనకపోవడం సంజూ శాంసన్‌కి ఇబ్బంది కలిగించింది.…
BGT Series: మెల్బోర్న్ వేదికగా జరగనున్న నాలుగో టెస్టుకు ముందు టీమిండియా కష్టాల్లో పడింది. కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ గాయాల కారణంగా టీమిండియా జట్టు ప్రణాళికలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. శనివారం కేఎల్ రాహుల్ చేతికి గాయం కాగా, ఆదివారం రోహిత్ శర్మ మోకాలికి గాయమైంది. ఈ ఇద్దరి గాయాల తీవ్రత ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ, వారు టెస్టుకు దూరమైతే జట్టుకు పెద్ద దెబ్బ అవుతుంది. ఇక 5 టెస్టుల సిరీస్ ప్రస్తుతం…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా నేడు పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. న్యూజీలాండ్‌పై మాదిరే ఆసీస్‌పై కూడా భారత టాప్ ఆర్డర్ విఫలమైంది. యువ బ్యాటర్స్ యశస్వి జైస్వాల్ (0), దేవదత్ పడిక్కల్ (0) డకౌట్ కాగా.. ఎన్నో ఆశలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ (5) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్ (26: 74 బంతుల్లో 3 ఫోర్లు) ఒక్కడే కాస్త పోరాడాడు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్…
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కోసం భారత బ్యాటర్లు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ అందరికంటే ముందుగానే కంగారో గడ్డపైకి అడుగుపెట్టారు. నేడు మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-ఏతో ఆరంభమైన అనధికారిక రెండో టెస్టులో బరిలోకి దిగారు. న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో విఫలమైన రాహుల్ ఈ టెస్టులో అయినా రాణిస్తాడనుకుంటే.. మరలా నిరాశపరిచాడు. ఓపెనర్‌గా వచ్చి కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరోవైపు యువ ఆటగాడు ధ్రువ్…
న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను భారత్ కోల్పోయిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై సిరీస్ కోల్పోవడమే కాకుండా.. వైట్ వాష్ ఇవ్వడంతో భారత జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. కివీస్ టెస్ట్ సిరీస్ ఘోర వైఫల్యం నేపథ్యంలో టీమిండియా మేనేజ్‌మెంట్ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ క్రమంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమ్ మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాటర్లు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్‌లను వారం ముందుగానే కంగారో గడ్డపైకి పంపనుంది. న్యూజిలాండ్ సిరీస్‌లోని…
న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టుల్లో ఓడిన భారత్ ఇప్పటికే సిరీస్ కోల్పోయింది. నవంబర్ 1 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో మూడో టెస్టు ఆరంభం కానుంది. చివరి టెస్టులో అయినా గెలిచి పరువు కాపాడుకోవాలని టీమిండియా చూస్తోంది. ఈ నేపథ్యంలో మూడో టెస్టుకు తుది జట్టులో మార్పులు చేర్పులు చేసే అవకాశముంది. రెండో టెస్టులో మూడు మార్పులతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. టాప్-4ను భారత్ కొనసాగించనుంది. కఠినమైన ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో రోహిత్ శర్మ, యశస్వి…
Dhruv Jurel equal ms dhoni record: ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీలో భారత్-A ఆటగాడు ధృవ్ జురెల్ వికెట్ కీపింగ్‌లో ముఖ్యమైన రికార్డును సమం చేశాడు. ఇండియా-Bతో జరిగిన మ్యాచ్‌లో వికెట్ కీపర్‌గా జురెల్ మొత్తం 7 క్యాచ్‌లు అందుకున్నాడు. ఈ టోర్నీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో ఉమ్మడిగా అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్‌కీపర్‌గా నిలిచాడు. ఈ విషయంలో మహేంద్ర సింగ్ ధోనీని సమం చేశాడు. ఇండియా-B లో చాలా మంది కీలక ఆటగాళ్లను అవుట్…