Dhruv Jurel Named Central Zone Captain: టీమిండియా వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. దులీప్ ట్రోఫీ 2025 ఆగస్టు 28 నుంచి బెంగళూరులో ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో సెంట్రల్ జోన్ జట్టుకు జురెల్ కెప్టెన్‌గా నియమితులయ్యాడు. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో తన అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన జురెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. సెంట్రల్ జోన్ జట్టులో రజత్ పటీదార్, కుల్దీప్ యాదవ్, దీపక్ చహర్, ఖలీల్ అహ్మద్ వంటి భారత స్టార్స్ ఉన్నారు. ఇంగ్లండ్ గడ్డపై ఆకట్టుకున్న జురెల్.. కెప్టెన్‌గా ఎలా రాణిస్తాడో చూడాలి. అయితే ఐపీఎల్ ప్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది.
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ జట్టును వీడేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. తనను జట్టు నుంచి రిలీజ్ చేయాలని ఆర్ఆర్ మేనేజ్‌మెంట్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. తనని ట్రేడ్ చేయాలని లేదా వేలంలో పాల్గొనేందుకు జట్టు నుంచి రిలీజ్ చేయాలని సంజు మేనేజ్‌మెంట్‌ను రిక్వెస్ట్ చేశాడట. దీంతో కొత్త కెప్టెన్‌పై ఆర్‌ఆర్ మేనేజ్‌మెంట్ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. తాజాగా సెంట్రల్ జోన్ జట్టుకు ధ్రువ్ జురెల్ సారథిగా ఎంపిక కాగానే.. ఆర్ఆర్ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో నిమిషాల్లో వైరల్ అయింది. కెప్టెన్ జురెల్ అంటూ క్యాప్షన్ ఇచ్చిన ఆర్ఆర్.. స్టంప్స్ వెనక ఉండి మ్యాచ్‌ను మార్చేసే ప్లేయర్ అంటూ పేర్కొంది. ఈ పోస్టుతో సారథ్య ఆర్ఆర్ బాధ్యతలు ఇక జురెల్‌కే అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే రాజస్థాన్ రాయల్స్ జట్టులో టీమిండియా ప్లేయర్స్ ఉండరు. యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ వంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు. పరాగ్ ఇప్పటికే కొన్ని మ్యాచ్‌లలో సారథిగా వ్యవహరించాడు కూడా. పరాగ్‌ను కాదని జురెల్‌కు కెప్టెన్సీ ఇస్తారా? అన్నది చూడాలి. 2021 నుంచి ఆర్ఆర్ కెప్టెన్‌గా సంజు శాంసన్ కొనసాగుతున్నాడు. 2025 మెగా వేలానికి ముందు రూ.18 కోట్లకు అతడిని రిటైన్ చేసుకుంది. సంజును తీసుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తిగా ఉందని సమాచారం.
Also Read: Raksha Bandhan 2025: ఆగస్టు 9న రక్షా బంధన్.. రాఖీ కట్టేందుకు శుభముహూర్తం ఇదే!
సెంట్రల్ జోన్ జట్టు:
ధ్రువ్ జురెల్ (కెప్టెన్/ కీపర్, యూపీ), రజత్ పటీదార్ (వైస్ కెప్టెన్, మధ్యప్రదేశ్), ఆర్యన్ జుయల్ (వికెట్ కీపర్, యూపీ), ఆయుష్ పాండే (ఛత్తీస్‌గఢ్), డానిష్ మలేవార్ (విదర్భ), శుభమ్ (మధ్యప్రదేశ్), ఛత్తీస్‌గర్ శర్మ (మధ్యప్రదేశ్), రాథోడ్ (విదర్భ), కుల్దీప్ యాదవ్ (యూపీ), హర్ష్ దూబే (విదర్భ), ఆదిత్య ఠాక్రే (విదర్భ), మానవ్ సుతార్ (రాజస్థాన్), దీపక్ చహర్ (రాజస్థాన్), ఖలీల్ అహ్మద్ (రాజస్థాన్), సరాంశ్ జైన్ (మధ్యప్రదేశ్).