Rishabh Pant: టెస్ట్ సిరీస్‌కు పంత్ దూరం.. 10 మందితోనే ఆడనున్న టీమిండియా!
- భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ
- టెస్ట్ సిరీస్‌కు రిషభ్ పంత్ దూరం
- పంత్‌కు ఆరు వారాలు విశ్రాంతి అవసరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishabh Pant Ruled Out of England vs India Test Series: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గాయపడ్డ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. మాంచెస్టర్ టెస్టులో గాయపడ్డ పంత్‌కు ఆరు వారాలు విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారు. దాంతో నాలుగో టెస్ట్ సహా.. ఐదవ టెస్టుకు సైతం అతడు దూరమయ్యాడు. పంత్ స్థానంలో మరో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ ఆడనున్నాడు. పంత్ పాదం చివరి వేలికి ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది.
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో రిషభ్ పంత్ గాయపడ్డాడు. ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నంలో అతడికి గాయం అయింది. బంతి బ్యాట్ ఎడ్జ్ తగిలి.. ఆపై పంత్ కుడి కాలి పాదానికి బలంగా తాకింది. వెంటనే అతడు నొప్పితో విలవిల్లాడిపోయాడు. చికిత్స చేసినా లాభం లేకపోవడంతో.. పత్యేక వాహనంలో పంత్ మైదానం నుంచి బయటకు వెళ్లాడు. పంత్ రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాక రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు. స్కాన్ రిపోర్ట్‌లలో పంత్ పాదం చివరి వేలికి ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. ఆరు వారాలు విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారు.
Also Read
రూల్స్ ప్రకారం.. కంకషన్ సబ్‌స్టిట్యూట్ అయితేనే గాయపడిన ఆటగాడి స్థానంలో మరో ప్లేయర్ వస్తాడు. ఇక్కడ రిషభ్ పంత్‌కు తలకు కాకుండా.. కాలికి గాయం అయింది కాబట్టి మరో ఆటగాడు భారత్ తరఫున బ్యాటింగ్ చేసే అవకాశం లేదు. కేవలం కీపింగ్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత్ 10 మందితోనే బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ. ఎందుకంటే ఈ సిరీస్‌లో అతడు అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. సిరీస్‌లో సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా ఉన్నాడు. ధ్రువ్ జురేల్ వికెట్ కీపింగ్ చేసే అవకాశం మాత్రమే ఉంది. మొదటి రోజు పంత్ 48 బంతుల్లో 37 పరుగులు చేశాడు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు