Bangaldesh: గతేడాది బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఆందోళనల తర్వాత అప్పటి ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి భారత్‌కు పారిపోయి వచ్చింది. అయితే, ఈ హింసాత్మక ఉద్యమంలో మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు హసీనాపై బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) నేరాలను మోపింది. ఈ కేసులో నవంబర్ 13న తీర్పును వెలువరించనుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో హై అలర్ట్ నెలకొంది. బంగ్లాదేశ్ వ్యాప్తంగా తీర్పుకు ముందే ఉద్రిక్తతలు పెరిగాయి. దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, కీలక ప్రదేశాల్లో సైన్యం, పోలీసులు…
Sheikh Hasina: గతేడాది హింసాత్మక విద్యార్థి ఉద్యమం తర్వాత షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చింది. అయితే, అప్పటి నుంచి హసీనా భారత్‌లో ప్రవాసంలో ఉంటున్నారు. బంగ్లాదేశ్ అవామీ లీగ్ పార్టీని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించిన తర్వాత, లక్షలాది మంది పార్టీ మద్దతుదారులు వచ్చే ఏడాది జరుగనున్న జాతీయ ఎన్నికల్ని బహిష్కరిస్తారని షేక్ హసీనా రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తాను ప్రస్తుతం, ఢిల్లీలో స్వేచ్ఛగా నివసిస్తున్నానని, అవకాశం…
Bangladesh: బంగ్లాదేశ్‌లో మైనారిటీలు ముఖ్యంగా హిందువుల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. తాజాగా, ఆ దేశ రాజధానిలో దుర్గా మాత ఆలయాన్ని కూల్చివేశారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై భారత్ నుంచి తీవ్ర ప్రతిస్పందన వచ్చింది. మరోవైపు, బంగ్లాదేశ్ అధికారులు ఈ చర్యను సమర్థించారు. ఆలయం తాత్కాలిక నిర్మాణం అని, చట్టవిరుద్ధంగా నిర్మించారని పేర్కొన్నారు.
Bangladesh: బంగ్లాదేశ్‌లో మహ్మద్ యూనస్ తన పట్టు నిలుపుకునేందుకు గేమ్స్ ఆడుతున్నాడు. ముఖ్యంగా, లౌకికవాదిగా, మాజీ ప్రధాని షేక్ హసీనాకు నమ్మకస్తుడిగా ఉన్న ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్‌ని ఆ పదవి నుంచి దించేందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ, అక్కడి మతోన్మాద సంస్థలు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో పరిస్థితులు వేగంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్, బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం రాజధాని ఢాకాలో విస్తృతంగా సైన్యం మోహరించింది. ఇది తిరుగుబాటు ఊహాగానాలను లేవనెత్తుతోంది. ఢాకాలో ఎప్పుడూ లేని విధంగా సైన్యం మోహరించడం చూస్తే ఏదో జరగబోతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లా సైన్యం, బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్, పారామిలిటరీ బలగాలు మోహరించబడ్డాయి.…
Bangladesh: షేక్ హసీనా పదవీచ్యుతురాలైన తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు రాజ్యమేలుతున్నాయి. తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉన్న మహ్మద్ యూనస్ ఈ మతఛాందసవాద శక్తుల్ని కంట్రోల్ చేయకపోవడమే కాకుండా, వారితో స్నేహం చేస్తున్నాడు. ఇదే ఇప్పుడు వారికి బలంగా మారింది. షేక్ హసీనా సమయంలో నిషేధాన్ని ఎదుర్కొన్న సంస్థలు కూడా బహిరంగంగా రోడ్లపైకి వచ్చి, ర్యాలీలు తీస్తున్నాయి.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వ్యాఖ్యలకు తాత్కాలిక దేశాధినేత మహ్మద్ యూనస్ స్పందించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాన మంత్రిని భారతదేశం నుంచి రప్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. ఆమెను బంగ్లాకు అప్పగించడానికి మేము అనేక ప్రయత్నాలు చేస్తున్నాం.. హసీనాను వ్యక్తిగతంగా విచారించడానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
Bangladesh: అమెరికన్ బిలియనీర్ జార్జ్ సోరోస్ కుమారుడు, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్(ఓఎస్ఎఫ్) ఛైర్పర్సన్ అలెక్స్ సోరోస్, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్‌ని కలవడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా ప్రస్తుతం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగ్లాదేశ్‌కి ఆర్థిక సాయాన్ని ఆపేసిన తర్వాత ఈ సంఘటన జరిగింది. గత అక్టోబర్ నెలలో సోరోస్, యూనస్ కలిశారు. తాజాగా వీరిద్దరు రెండోసారి కలుసుకున్నారు.
India- Bangladesh: బంగ్లాదేశ్‌లో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పర్యటించారు. ఈ సందర్భంగా బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ అధిపతి ముహమ్మద్ యూనస్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో యూనస్, మిస్రీల మధ్య 40 నిమిషాల పాటు చర్చ జరిగింది.