Bangladesh: “శుక్రవారం ఘటన బంగ్లాదేశ్‌ను షేక్ చేస్తుంది”.. గర్ల్‌ఫ్రెండ్‌తో “హదీ” హత్యా నిందితుడు..
- రాడికల్ విద్యార్థి నేత హదీ హత్యతో బంగ్లాలో హింస..
- ‘‘ఈ హత్య దేశాన్ని షేక్ చేస్తుంది.’’
- గర్ల్ ఫ్రెండ్‌కు ముందే చెప్పిన హంతకుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: భారత వ్యతిరేకి, రాడికల్ ఇస్లామిస్ట్ విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య బంగ్లాదేశ్‌ను అట్టుడికేలా చేస్తోంది. డిసెంబర్ 12న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చారు, మహ్మద్ యూనస్ ప్రభుత్వం ఎయిర్ అంబులెన్స్ ద్వారా అతడిని సింగపూర్‌కు మెరుగైన వైద్యం కోసం తరలించింది. డిసెంబర్ 19న అతను చికిత్స తీసుకుంటూ మరణించాడు. అయితే, ఇతడి మరణం బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలకు కారణమైంది. ఢాకాలో పలు మీడియా సంస్థలపై దాడులు చేయడంతో పాటు, షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ నేతలపై దాడులకు తెగబడ్డారు. మైమన్సింగ్ జిల్లాలో దైవదూషణకు పాల్పడ్డాడనే ఆరోపణలపై ఒక హిందువును దారుణం కొట్టి, చెట్టుకు కట్టేసి కాల్చి చంపారు.
అయితే, ఈ ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హదీ హంతకుల్లో ఒకరిగా భావిస్తున్న ప్రధాన నిందితుడు ఫైసల్ కరీం, తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఈ హత్య గురించి పరోక్షంగా చెప్పినట్లు తెలిసింది. కాల్పులకు ముందు రోజు రాత్రి ఢాకాలోని ఒక రిసార్ట్‌లో బస చేసిన ఫైసల్, తన గర్ల్ ఫ్రెండ్ మరియా అక్తర్ లిమాతో ‘‘మొత్తం బంగ్లాదేశ్ షేక్ అయ్యే ఘటన’’ జరగబోతోందని చెప్పాడు. అతను మరియాకు హదీకి సంబంధించిన ఒక క్లిప్ కూడా చూపించాడని అక్కడి మీడియా నివేదించింది. ‘‘రేపు (శుక్రవారం) ఏదో జరగబోతోంది, దానితో దేశం మొత్తం వణికిపోతుంది’’ అని అక్కడ డైటీ జుగాంతర్ పత్రిక చెప్పింది. ఈ కేసులో మరియాతో సహా పలువురిని అరెస్ట్ చేశారు. ఫైసల్‌కు సాహెదా పర్వీన్ సామియా అనే మహిళతో వివాహం జరిగింది. ఆమెతో పాటు అతడి కుటుంబ సభ్యుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read
పక్కా ప్రణాళికతోనే హదీ హత్య:
షరీఫ్ ఉస్మాన్ హదీని పక్కా ప్రణాళికతోనే హత్య చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల దర్యాప్తులో ఇందులో ఒక మాజీ కౌన్సిలర్‌పై అనుమానం ఉన్నట్లు తేలింది. నిధుల సమీకరణ, ఆయుధాల సేకరణ, దాడి, పారిపోయేందుకు సహకరించడంలో మొత్తం 20 మంది వ్యక్తులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు 9 మందిని అరెస్ట్ చేశారు. ఫైసల్ సోదరి నివాసంలో కాల్పులకు ఉపయోగించిన మ్యాగజైన్, 11 రౌండ్ల మందుగుండు సామాగ్రి లభించింది. ఢాకా సమీపంలోని ఒక చెరువులో రెండు విదేశీ పిస్టల్లు, రెండు మ్యాగజైన్స్ స్వాధీనం చేసుకున్నారు.
కాల్పుల సమయంలో ఉపయోగించిన మోటార్ సైకిల్ నకిలీ నెంబర్ ప్లేట్ ఉపయోగించినట్లు తెలిసింది. పట్టుబడకుండా ఉండేందుకు ఫైసల్ తండ్రి నెంబర్ ప్లేట్లను మార్చినట్లు పోలీసులు కనుగొన్నారు. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితులు ఫైసల్, అతడి సహాయకులు భారత్ పారిపోయినట్లు అక్కడి మీడియా నివేదిస్తోంది. అయితే, భారత్ వెళ్లారనే దానికి ఆధారాలే లేవని ఢాకా పోలీసులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!