Sheikh Hasina: గతేడాది హింసాత్మక విద్యార్థి ఉద్యమం తర్వాత షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చింది. అయితే, అప్పటి నుంచి హసీనా భారత్‌లో ప్రవాసంలో ఉంటున్నారు. బంగ్లాదేశ్ అవామీ లీగ్ పార్టీని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించిన తర్వాత, లక్షలాది మంది పార్టీ మద్దతుదారులు వచ్చే ఏడాది జరుగనున్న జాతీయ ఎన్నికల్ని బహిష్కరిస్తారని షేక్ హసీనా రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తాను ప్రస్తుతం, ఢిల్లీలో స్వేచ్ఛగా నివసిస్తున్నానని, అవకాశం వస్తే నా దేశానికి తిరిగి వెళ్లాలని ఉందని చెప్పారు. అయితే, అవామీ లీగ్ కాకుండా ఏ ప్రభుత్వం ఏర్పడిన తాను తిరిగి వెళ్లనని ఆమె స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌లో చట్టబద్ధమైన ప్రభుత్వం, రాజ్యాంగ పాలన, శాంతి, స్థిరత్వం ఉన్నప్పడు మాత్రమే తాను బంగ్లా వెళ్తానని చెప్పారు.
Read Also: Cyclone Montha: తుఫాన్ అనంతర చర్యలు అత్యంత కీలకం.. యుద్ధ ప్రాతిపదికన పని చేయాలి..
ప్రస్తుతం, బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేతగా మహ్మద్ యూనస్ కొనసాగుతున్నాడు. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని యూనస్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, అవామీలీగ్ పై నిషేధం అన్యాయమని, దేశానికి ప్రతికూలం అని, కొట్లాది మంది ప్రజల మద్దతు ఉన్న పార్టీని ఎన్నికల నుంచి తప్పించడం ప్రజాస్వామ్యానికి ముప్పు అని ఆమె అన్నారు. ఈ ఏడాది మేలో బంగ్లా ఎన్నికల సంఘం అవామీ లీగ్ రిజస్ట్రేషన్ ను సస్పెండ్ చేసింది. ప్రభుత్వం పార్టీ కార్యకలాపాలను నిలిపేసింది.
అవామీలీగ్ భవిష్యత్తులో రాజకీయ పాత్ర పోషిస్తుందని, ప్రభుత్వం లేదా ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందని, పార్టీ తన కుటుంబం ఆధారంగా కాకుండా దేశం ఆధారంగా ఉండాలని అన్నారు. ఆమె కుమారుడు సజీబ్ వాజెడ్ అమెరికాలో ఉంటూ పార్టీకి సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. అవసరం అయితే తానే పార్టీని నడిపేందుకు సిద్ధమని గత ఏడాది చెప్పారు. హసీనా తండ్రి , ముగ్గురు సోదరులను 1975 సైనిక తిరుగుబాటులో హత్య చేశారు. అందుకే తాను ఇప్పటి వరకు భద్రతపై జాగ్రత్తగా ఉంటున్నానని చెప్పారు.