Bangladesh: షేక్ హసీనా పదవీచ్యుతురాలైన తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు రాజ్యమేలుతున్నాయి. తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉన్న మహ్మద్ యూనస్ ఈ మతఛాందసవాద శక్తుల్ని కంట్రోల్ చేయకపోవడమే కాకుండా, వారితో స్నేహం చేస్తున్నాడు. ఇదే ఇప్పుడు వారికి బలంగా మారింది. షేక్ హసీనా సమయంలో నిషేధాన్ని ఎదుర్కొన్న సంస్థలు కూడా బహిరంగంగా రోడ్లపైకి వచ్చి, ర్యాలీలు తీస్తున్నాయి.
Read Also: Jio Recharge Plan: 90 రోజుల వ్యాలిడిటీ.. రోజుకు 2GB డేటా.. ఉచిత OTT యాప్‌లతో అద్భుతమైన ప్లాన్
తాజాగా, రాడికల్ ఇస్లామిస్ట్ సంస్థ హిజ్బ్ ఉత్-తహ్రీర్ శుక్రవారం ప్రార్థనల అనంతరం దేశ రాజధాని ఢాకాలో తన మొదటి బహిరంగ ర్యాలీని నిర్వహించింది. వేలాది మంది సభ్యులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. బైతుల్ ముకర్రం జాతీయ మసీదు నుంచి ర్యాలీ ప్రారంభమైంది. ‘‘ఖలీఫా రాజ్యం’’ కోసం ఈ ర్యాలీని నిర్వహించారు. దీనికి ‘‘ మార్చ్ ఫర్ ఖిలాఫత్’’ అనే పేరు పెట్టారు. ఉరేగింపుని ఆపడానికి పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసుల టియర్ గ్యాస్, సౌండ్ గ్రెనేడ్లను ఉపయోగించారు. ముస్లిం-దేశాలను ఒక్కటిగా చేసి ప్రపంచ ఇస్లామిక్ ఖలీఫా, లేదా కాలిఫేట్ స్థాపన చేయాలని, ఇస్లామిక్ ప్రభుత్వం కింద ఏకం కావాలని హిజ్బ్ ఉత్ తహ్రీర్ డిమాండ్ చేస్తోంది.
షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఇస్లామిక్ గ్రూపులు మరింతగా స్వేచ్ఛ లభించింది. అనేక నిషేధిత ఇస్లామిక్ సంస్థలు బంగ్లాదేశ్‌లో చురుకుగా పనిచేస్తున్నాయి. జమాతే ఇస్లామి, హెఫాజత్ ఇ ఇస్లాం వంటి సంస్థలు బలపడ్డాయి. ఇప్పుడు ఏకంగా హిజ్బ్ ఉత్ తహ్రీర్ ఏకంగా బహిరంగ ర్యాలీలే చేపడుతోంది. అక్టోబర్ 2009 నుంచి బంగ్లాదేశ్‌లో దీనిని నిషేధించారు.