ప్రయాణికులకు ఇండిగో సృష్టించిన సంక్షోభంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) చర్యలకు సిద్ధపడింది. ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్‌తో సమావేశం తర్వాత చర్యలకు పూనుకుంది. ఇండిగో సంక్షోభానికి కారణమైన నలుగురు ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్లను తొలగించింది.
IndiGo Crisis: ఆరు రోజులుగా దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు, ప్రయాణికుల్ని తీవ్రంగా గందరగోళానికి గురి చేసింది. డీజీసీఏ కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నిబంధనలకు అనుగుణంగా రోస్టర్ నిర్వహణ లోపం, మారిన నిబంధనలకు సిద్ధంగా లేకపోవడం వల్ల ఇండిగో గందరగోళం చెలరేగింది. దేశంలో అతిపెద్ద ఎయిర్‌లైనర్, మార్కెట్‌లో మెజారిటీ షేర్ కలిగిన ఇండిగో కావాలనే ఇలా తన వ్యవస్థల్ని కుప్పకూల్చిందని సాధారణ ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇండిగో వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం…
IndiGo Chaos: ఇండిగో సంస్థ సంక్షోభం తీవ్రతరం కావడంతో దేశవ్యాప్తంగా పలు ఎయిర్ లైన్స్ విమాన టికెట్ ధరలు ఒక్కసారిగా పెంచేశాయి. దీంతో ప్రయాణికులపై తీవ్ర భారం పడటంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
PM Modi: భారతదేశంలో అతి పెద్ద విమానయాన సంస్థ ఇండిగో గత కొన్ని రోజులుగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. విమానాల ఆలస్యం, రద్దులు పెరగడంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
IndiGo CEO vs Central Govt: ఇండిగో విమానయాన సంస్థ సర్వీసుల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతుండటంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఈ సంక్షోభం ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు.
IndiGo Refund Issue: ప్రయాణికుల లగేజీలను 48 గంటల్లో ఎవరివి వాళ్లకి అప్పగించాలని కేంద్రం తెలియజేసింది. ఈ రీఫండ్ ప్రక్రియలో జాప్యం చేసినా లేక ఆదేశాలను బేఖాతరు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
హమ్మయ్య.. ప్రయాణికులు ఊపిరి పీల్చుకునే శుభవార్త. మూడు రోజులుగా నరకయాతన పడుతున్న ప్రయాణికులకు డీజీసీఏ చెక్ పెట్టింది. నవంబర్ 1 నుంచి విధించిన కొత్త ఆంక్షలను వారం పాటు ఎత్తివేసింది. దీంతో ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో తలెత్తిన సంక్షోభానికి తెర పడినట్లైంది.
IndiGo CEO Apology: ఇండిగో విమానయాన సంస్థ గత మూడు రోజులుగా ఆపరేషనల్ సమస్యలను ఎదుర్కొంటోంది. భారీ సంఖ్యలో విమానాలు రద్దు కావడంతో పాటు అనేక ఫ్లైట్లు ఆలస్యమవుతుండటంతో దేశవ్యాప్తంగా ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులపై ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ ఈరోజు (డిసెంబర్ 4న) అధికారికంగా క్షమాపణలు చెప్పారు.
ఇండిగో విమాన సంస్థ ఇచ్చిన షాక్‌తో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో నరకయాతన పడుతున్నారు. అటు ప్రయాణాలు లేక.. ఇటు ఇంటికి వెళ్లలేక.. తిండి తిప్పలు లేక విమానాశ్రయాల్లోనే పడిగాపులు పడుతున్నారు.
దీపావళికి ముందు విమాన ప్రయాణ డిమాండ్ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తూ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అధిక టిక్కెట్ ధరల పెంపుపై విమానయాన సంస్థలను హెచ్చరించింది. పండుగ సీజన్లో ప్రయాణీకులు అధిక ధరలు చెల్లించాల్సిన అవసరం లేకుండా విమాన సామర్థ్యాన్ని పెంచాలని, ఛార్జీలను తక్కువగా ఉంచాలని నియంత్రణ సంస్థ అన్ని దేశీయ విమానయాన సంస్థలను ఆదేశించింది. ఒక ప్రకటనలో, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రయాణీకులపై అధిక టిక్కెట్ రేట్ల…