IndiGo Chaos: 500 కిలోమీటర్ల వరకు రూ.7,500.. ఇండిగో సంక్షోభం వేళ ఛార్జీలను ఫిక్స్ చేసిన కేంద్రం
- ఇండిగో సంక్షోభంపై ధరలు నియంత్రణకు కేంద్రం చర్యలు..
- విమాన సర్వీసు ఛార్జీలను నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం..
- 500 కిలో మీటర్ల వరకు గరిష్ఠంగా రూ.7.500..
- కిలోమీటర్ల వరకు ఛార్జీ రూ.12 వేలు..
- 1500 కిలోమీటర్ల వరకు గరిష్ఠ ఛార్జీ రూ. 15 వేలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IndiGo Chaos: ఇండిగో సంస్థ సంక్షోభం తీవ్రతరం కావడంతో దేశవ్యాప్తంగా పలు ఎయిర్ లైన్స్ విమాన టికెట్ ధరలు ఒక్కసారిగా పెంచేశాయి. దీంతో ప్రయాణికులపై తీవ్ర భారం పడటంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా ఈరోజు ( డిసెంబర్ 6న) కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఏ ఎయిర్‌లైన్ అయినా తాము విధించిన ధరలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే, UDF, PSF, ట్యాక్సులు మినహా, బిజినెస్ క్లాస్, UDAN పథకం విమానాలకు ఈ క్యాప్స్ వర్తించవు అని వెల్లడించింది.
Read Also: Kasuri – Masood: జైషే అగ్ర కమాండర్ల ‘రహస్య సమావేశం’.. భారత్‌పై భారీ కుట్రకు ప్లాన్!
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
అయితే, విమాన టికెట్ ధరల్లో ఎలాంటి పెరుగుదల కనిపించినా.. ప్రయాణికులను దోచుకునే విధంగా అధిక చార్జీలు వసూలు చేసినా.. సంబంధిత ఎయిర్‌లైన్‌పై తక్షణ చర్య తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. అలాగే, డిమాండ్ పెరిగిన రూట్లపై ఎయిర్‌లైన్లు అదనపు సర్వీసులు పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక, కొత్త FDTL (Flight Duty Time Limitation) నిబంధనల కారణంగా ఇండిగో విమానయాన సంస్థ భారీ ఆపరేషనల్ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దీని మూలంగా గత కొన్ని రోజుల్లో వెయ్యికి పైగా విమానాలు రద్దు అయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే దాదాపు 1000 విమానాలు రద్దు కావడం కలకలం రేపింది. దీంతో దేశవ్యాప్తంగా ఎయిరిండియా, స్పై్స్ జెట్ విమాన సంస్థలు చార్జీలను 3 నుంచి 4 రెట్లు పెంచేశాయి.
Read Also: PM Modi: ఇండిగో సంక్షోభంపై ప్రధాని మోడీ సమీక్ష..
కేంద్రం కొత్తగా విధించిన విమాన ధరలు..
* 500 కిలోమీటర్ల వరకు: రూ. 7,500
* 500–1000 కిలోమీటర్లు: రూ. 12,000
* 1000–1500 కిలోమీటర్లు: రూ. 15,000
* 1500 కిలోమీటర్లకు పైగా: రూ. 18,000
తాజావార్తలు
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!