సుఖేష్ చంద్రశేఖర్‌కు వైద్య కారణాలపై అతని సొంత ఖర్చుతో ఎయిర్ కూలర్‌ను అందించాలని జైలు అధికారులను ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ఇటీవలి ఉత్తర్వుల్లో ఆదేశించింది. రూ.200 కోట్ల దోపిడీ కేసుకు సంబంధించి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న చంద్రశేఖర్, అధిక ఉష్ణోగ్రత కారణంగా చర్మ సమస్యలకు గురయ్యారని వైద్య కారణాలతో ఉపశమనం పొందారు.
సుప్రీంకోర్టులో జూలై 29 నుంచి ఆగస్టు 3 వరకు ప్రత్యేక లోక్‌అదాలత్ నిర్వహించనున్నారు. సుప్రీంకోర్టు స్థాపించిన 75వ సంవత్సరంలో ప్రత్యేక లోక్ అదాలత్‌ను నిర్వహిస్తోంది. ఈ సమయంలో ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన కేసులను త్వరితగతిన విచారించనున్నారు. సామాన్య ప్రజలు ఈ లోక్ అదాలత్ ద్వారా ప్రయోజనం పొందనున్నారు. స్థాపన జరిగిన 75వ సంవత్సరంలో.. తగిన పెండింగ్‌లో ఉన్న కేసుల సామరస్య పరిష్కారాన్ని కనుగొనడానికి సుప్రీంకోర్టు 2024 జూలై 29 నుండి 2024 ఆగస్టు 3 వరకు ప్రత్యేక…
డ్రైవర్ లేకుండానే మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. ఇంతకీ ఎక్కడా అనుకుంటున్నారా.. దేశ రాజధాని ఢిల్లీలోని మెజెంటా లైన్ మార్గంలో డ్రైవర్ లెస్ మెట్రో రైలు నడవనుంది. జూలై 1 నుండి ఇది ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. జూలై నెలలో మెజెంటా లైన్ లో కనపడరని DMRC తెలిపింది.
అసలే హస్తినలో అధిక ఉష్ణోగ్రతలు.. ఇంకోవైపు కరెంట్ కోతలు.. మరోవైపు తాగునీటి కష్టాలు.. ఇలా దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానం రెండు గంటలు ఆగిపోయింది.
ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమావేశం ప్రారంభమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి సోనియా, రాహుల్, ప్రియాంక పాల్గొన్నారు.
దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇంకా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అంతేకాకుండా.. వేడిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో అధికంగా ఉన్నాయి. వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం.. జూన్ 16 నుండి 18 వరకు ఉత్తరప్రదేశ్‌లోని చాలా ప్రాంతాలలో హీట్ వేవ్ నుండి తీవ్రమైన హీట్ వేవ్ వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
దేశ రాజధాని ఢిల్లీలో అగ్ని ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రోజుకో చోట అగ్ని ప్రమాదం జరుగుతుంది. తాజాగా.. ముండ్కా ప్రాంతంలోని ఎల్ఈడీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో.. 40 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలను అదుపు చేస్తున్నాయి. ఈ ప్రమాద ఘటనపై.. చీఫ్ ఫైర్ ఆఫీసర్ వీరేంద్ర సింగ్ మాట్లాడుతూ, 'ఉదయం 7 గంటల ప్రాంతంలో చెత్తకు నిప్పంటుకున్నట్లు తమకు ఫోన్ వచ్చిందని తెలిపారు. దీంతో.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నామని అన్నారు. అప్పటికే..…
ఢిల్లీలో నీటి సమస్య తీవ్ర తరమవుతుంది. నీటి కోసం దాడులు చేసుకున్న సంఘటనలు వెలువడుతున్నాయి. ద్వారకా జిల్లాలో నీటి కోసం పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకుని వారికి సర్దిచెప్పారు. అయితే.. ఈ ఘర్షణలో ఎలాంటి మతపరమైన కోణం లేదని పోలీసులు స్పష్టం చేశారు. పబ్లిక్ కుళాయి నుంచి నీటిని తీసుకునే విషయంలో ఘర్షణ జరిగినట్లు ఢిల్లీ పోలీసులు…
మెట్రో రెడ్ లైన్ విస్తరణకు మార్గం సుగమమైంది. రిథాలా-నరేలా-కుండ్లీ మెట్రో కారిడార్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనను గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డీడీఏ (DDA) పంపింది. ఈ మేరకు శనివారం రాజ్‌నివాస్ వెల్లడించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఈ మెట్రో కారిడార్ నిర్మాణ అంశాన్ని కేంద్రంతో వివిధ సందర్భాల్లో ప్రస్తావించినట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది.