సివిల్ ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఢిల్లీ మెట్రో గుడ్‌న్యూస్ చెప్పింది. ఫేజ్-III విభాగాల్లో ఢిల్లీ మెట్రో సేవలు జూన్ 16న ఉదయం 6 గంటల నుంచి అందుబాటులోకి రానుందని వెల్లడించింది.
ఇటలీలో జీ7 శిఖరాగ్ర సమావేశానికి హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఇటలీ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు. ఇటలీ పర్యటనలో జీ7 దేశాల ఔట్ రీచ్ సదస్సుకు హాజరైన మోడీ.. వివిధ దేశాధినేతలతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
ఢిల్లీలో నీటి సమస్యలపై ఆందోళనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆప్ సర్కార్ పై ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఎక్కడికక్కడ నిరసనలు చేపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మొన్నటి వరకు మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ.. నీటి సమస్యపై ఆప్ పార్టీపై యుద్ధం ప్రకటించింది. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు సర్కార్ కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. నీటి సమస్యలు పరిష్కరించాలంటూ ప్లకార్డులు పట్టుకుని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. మట్టి కుండలు పగలగొట్టి…
ఢిల్లీలో అగ్ని ప్రమాద ఘటనలు రోజు రోజుకు అవుతున్నాయి. ఇప్పటికే చాందినీ చౌక్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 50 దుకాణాలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం ఏర్పడింది. ఈ ప్రమాద ఘటన నుంచి తేరుకోక ముందే.. దేశ రాజధానిలో మరో ప్రమాదం సంభవించింది. దీంతో.. ఢిల్లీ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు.. ఢిల్లీలో ఎండలు ఇప్పటికీ తీవ్రంగా ఉన్నాయి. ఆ కారణం చేత ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
కువైట్ అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారిలో కేరళకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. అయితే వారి మృతదేహాలు ఈరోజు రాష్ట్రానికి వచ్చాయి. మృతదేహాలకు రాష్ట్ర ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికింది. రాష్ట్రంలోని వలస సమాజాన్ని ప్రభావితం చేసిన అతిపెద్ద సంఘటనలలో ఇది ఒకటి. మరోవైపు.. బాధితుల ఇళ్లలో చోటు చేసుకున్న దృశ్యాలు హృదయ విదారకంగా మారాయి.
దేశ వ్యాప్తంగా ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేలా మోడీ ప్రభుత్వం ఆలోచన చేసింది. ఇందులో భాగంగా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది.
దేశంలో నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛమైన నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. నీటి కొరత వెనుక వాతావరణ మార్పు ఒక ప్రధాన కారణం అయితే, మితిమీరిన వినియోగం, వృథా కూడా నీటి సంక్షోభ ప్రమాదాన్ని పెంచింది.
ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో గురువారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 50 దుకాణాలు ఉన్న రెండు భవనాలు మంటల్లో కాలిపోయాయి. ఇప్పుడు ఆ ప్రాంతంలో మొత్తం బూడిదే కనిపిస్తుంది. 12 గంటల పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయినప్పటికీ భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ అగ్నిప్రమాదంలో ధ్వంసమైన దుకాణాల సంఖ్య ఇంకా పెరగవచ్చని.. వ్యాపారుల నష్టం కోట్లలో ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చాందినీ చౌక్‌లోని మార్వాడీ కత్రాలో ఈరోజు సాయంత్రం భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో హుటాహుటిన 30 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నాయి. మరోవైపు.. ఇంత భారీ అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసు బృందాలు కూడా ఘటనా స్థలంలో మోహరించారు.
ప్రపంచంలోని అతిపెద్ద నగరాల విషయానికి వస్తే ముందుగా ఆ నగరాల పరిమాణం ముఖ్యం. విస్తారమైన మహానగరాల నుండి జనసాంద్రత కలిగిన పట్టణ కేంద్రాల వరకు, ఈ నగరాలు లక్షలాది మందికి నివాసంగా ఉన్నాయి. అలాగే విస్తారమైన భూభాగాలను కలిగి ఉన్నాయి. ఇకపోతే విస్తీర్ణం వారీగా ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద నగరాల వివరాలు చూస్తే.. 1. టోక్యో (జపాన్): జపాన్ లోని టోక్యో నగరం ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన మెట్రోపాలిటన్ ప్రాంతాలలో ఒకటి. మొత్తం 2,000…