ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 1 వద్ద పైకప్పు కూలిపోవడంతో ఒకరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. పౌర విమానయాన శాఖ మంత్రి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఇది చాలా తీవ్రమైన ఘటన అని ఆయన వ్యాఖ్యానించారు. కూలిన టర్మినల్ పైకప్పు 2008-09 కాలంలో నిర్మించబడిందని మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం తెలిపారు.
ఈరోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండనున్నారు. నేడు వరంగల్ పర్యటన ఉన్నా.. తన టూర్ ను వాయిదా వేసుకుని హస్తినలోనే ఉన్నారు. ఇప్పటికే పీసీసీ చీఫ్, కేబినెట్ విస్తరణపై పార్టీ పెద్దలతో సమాలోచనలు జరిపారు. మరోవైపు.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి సహా.. డిప్యూట సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ భేటీ అయ్యారు. తెలంగాణ…
తల్లి పాలలో ఉండే లాక్టోఫెర్రిన్ ప్రోటీన్ బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్మైకోసిస్) సంక్రమణను నాశనం చేయడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది చాలా ప్రాణాంతకంగా పరిగణించబడుతుంది. ఎయిమ్స్లోని బయోఫిజిక్స్ అండ్ మైక్రోబయాలజీ విభాగానికి చెందిన వైద్యులు ల్యాబ్లో జరిపిన పరిశోధనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఎయిమ్స్ (AIIMS) ఈ పరిశోధన అంతర్జాతీయ మెడికల్ జర్నల్ (ఫ్యూజర్ మైక్రోబయాలజీ జర్నల్)లో ప్రచురించబడింది. భవిష్యత్తులో తల్లి పాలలో ఉండే లాక్టోఫెర్రిన్ ప్రొటీన్ నుండి బ్లాక్ ఫంగస్కు ఔషధాన్ని తయారు…
MLC Jeevan reddy: ఢిల్లీలోని తెలంగాణ భవన్ శబరి బ్లాక్లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమావేశం ముగిసింది.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో రాత్రి 8 గంటలకు ఇండియా కూటమి ఫ్లోర్ లీడర్లు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఇదిలా ఉంటే సోమవారం నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి.
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) 2023-24 మూడు, నాలుగు త్రైమాసికాల నిధులు రూ.323.73 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా.. ఎన్హెచ్ఎంలో 2024-25 మొదటి త్రైమాసిక గ్రాంట్ రూ.231.40 కోట్లు మంజురు చేయాలని కోరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నిన్న ఇద్దరు కేంద్ర మంత్రులను సీఎం కలిశారు. ఇవాళ కేంద్ర మంత్రి జేపీ నడ్డా తో సమావేశం కానున్నారు.
18వ పార్లమెంట్ సమావేశాలు సోమవారం సందడిగా ప్రారంభమయ్యాయి. ఎన్నికైన ఎంపీలతో పార్లమెంట్ పరిసరాలు ఉల్లాసంగా కనిపించాయి. ఒకరికొకరు పలకరించుకుంటూ సందడిగా కనిపించింది.