దేశ రాజధానిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పిల్లలు లేని తల్లిదండ్రులు ఎంతో బాధపడుతుంటే.. ఈ కసాయి తండ్రి మాత్రం కవల ఆడపిల్లలు పుట్టారని చంపేశాడు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టడం ఇష్టం లేదని.. ఈ క్రమంలో తండ్రి, అతని కుటుంబం ఆ పిల్లలను చంపి.. పూడ్చిపెట్టారు. కాగా.. ఈ ఘటనపై నిందితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో.. ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి, న్యాయ ఆదేశాల మేరకు శిశువుల మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం…
ఢిల్లీలో ఓ దపంతుల జంట వేర్వేరు చోట్ల ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు ఈశాన్య రాష్ట్రమైన అస్సాంకు చెందినవారిగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు శనివారం సమాచారం అందించారు. జుమీ దాస్, ఆమె భర్త భాస్కర్ దేకా (27)గా పోలీసులు తెలిపారు. కాగా.. ఝుమీ దాస్ హౌస్ కీపింగ్ సిబ్బందిగా పనిచేసింది. భర్త చాందినీ చౌక్ ప్రాంతంలోని ఓమాక్స్ మాల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే వాడు.
ఢిల్లీ పోలీస్ ఆఫీసరుగా నటించి కోల్‌కతాకు చెందిన ఓ వ్యాపారి కుమారుడి దగ్గరి నుంచి రూ.3 కోట్లు దోపిడీ చేశాడు. ఈ కేసులో హర్యానాకు చెందిన ఇద్దరు వ్యక్తులను మెట్రోపాలిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు సచిన్ కుమార్, దీపక్ కుమార్ గా గుర్తించారు. కాగా.. తనకు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చిందని బాధితుడు కోల్‌కతా పోలీసుల సైబర్ సెల్లో ఫిర్యాదు చేశాడు. కాల్ చేసిన వ్యక్తి తనను తాను ఢిల్లీ పోలీసు అధికారి అని…
ఉత్తర భారతదేశంలో తన నెట్‌వర్క్‌ను విస్తరించడంతో పాటు.. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు ఒబెన్ ఎలక్ట్రిక్ తన కొత్త ఎలక్ట్రిక్ బైక్ ఒబెన్ రోర్‌ను ఢిల్లీలో అధికారికంగా విడుదల చేసింది. కంపెనీ తన మొదటి డీలర్‌షిప్‌ను ఢిల్లీలోని పితంపురాలో ప్రారంభించింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో చేర్చబడిన ఈ ఎలక్ట్రిక్ బైక్ ప్రారంభ ధర రూ. 1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించబడింది.
గత కొద్ది రోజులుగా వేడి గాలులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న హస్తిన వాసులకు శుక్రవారం ఉపశమనం లభించింది. పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అలాగే హర్యానాలోని గురుగ్రామ్‌లో కూడా భారీ వర్షం కురుస్తోంది.
ఆ యువకుడు తన నివాసానికి వందల కిలోమీట్ల దూరంలోని ఓ ప్రాంతానికి వచ్చాడు. అక్కడే ఉన్న ఓ అమ్మాయిని కలిశాడు. వారిద్దరూ ఐడీ ఫ్రూప్ చూయించి ఓయోలో రూమ్ తీసుకున్నారు. రూమ్ లోకి వెళ్లారు. అంతే మళ్లీ బయటకు రాలేదు.
మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు గురువారం ఊరట లభించింది. లక్ష రూపాయల పూచీకత్తుతో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.