ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్లలో ఏపీ పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి సరిదిద్ద లేనంత నష్టం జరిగిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని బాగు చేస్తుందని అన్నారు. ఏపీ గ్లోబల్ లీడర్ గా తయారు చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. దక్షిణాదిలో ఏ రాష్ట్రానికి లేనన్ని గొప్ప వనరులు ఏపీకి ఉన్నాయి.. కృష్ణా గోదావరి నదులు రాష్ట్రం గుండా వెళ్తున్నాయి.. ఒక్క గోదావరి నది నుంచి 3 వేల టీఎంసీల నీరు సముద్రం పాలు అవుతుంది.. ఆ నీటిని వినియోగించుకుంటే దక్షిణాది మొత్తానికి నీటిని ఇవ్వొచ్చని తెలిపారు.
Read Also: Conocarpus Plants: ఈ చెట్టు మహా డేంజర్.. గాలి పీలిస్తే అంతే సంగతులు..!
కేంద్రం నుంచి ఎలాంటి పదవులు ఆశించలేదు.. పదవుల కోసం డిమాండ్ చేయలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. వాజ్ పేయి హయాంలో 7 మంత్రి పదవులు ఇస్తామన్న తీసుకోలేదు.. ఒక్క స్పీకర్ మాత్రమే తీసుకున్నామన్నారు. డిప్యూటీ స్పీకర్ పదవి అడగలేదు.. వాళ్ళు ఇస్తామనలేదని తెలిపారు. తమకిచ్చిన మంత్రి పదవుల పట్ల తాము సంతోషంగా ఉన్నామని అన్నారు. మరోవైపు.. ఐదేళ్ల జగన్ పాలన వల్ల అమరావతి ప్రాముఖ్యత తగ్గింది.. అమరావతికి ప్రాముఖ్యత తీసుకు వచ్చేలా పనిచేస్తామన్నారు. ఐదేళ్లలో ప్రభుత్వ పరంగా కావాల్సిన మౌలిక వసతుల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. దశల వారిగా నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు చంద్రబాబు.
Read Also: UP: శోభనం గదిలో వరుడి ఆత్మహత్య.. అసలేం జరిగింది?
ఐదేళ్లలో శాశ్వత అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాలు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో నైపుణ్య గణన చేపడతామని.. అందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. అంతేకాకుండా.. మానవ వనరులను మూలధన వనరులుగా మార్చి సంపద సృష్టిస్తామని చెప్పారు. అమరావతి నిర్మాణం నిరంతర ప్రక్రియ.. మరోవైపు.. తెలంగాణ సీఎం రేవంత్ తో సమావేశంలో ఇరు రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తూ సమస్యలు పరిష్కరించుకోవలనేది తమ లక్ష్యమని తెలిపారు. ఏపీలో పెట్టుబడులకు ఇబ్బంది లేదు.. ఈ ఏడాది దావోస్ కి వెళ్తా.. ఏపీకి పెట్టుబడులు తెస్తామని చంద్రబాబు చెప్పారు.