న్యూఢిల్లీలోని పాకిస్థాన్‌కు చెందిన అగ్రశ్రేణి దౌత్యవేత్త నివాసంలో వంట మనిషిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. అతడిపై ఢిల్లీలో ప్రత్యేక ఎఫ్‌ఐఆర్ నమోదైంది. పాకిస్థాన్ జాతీయుడు మిన్హాజ్ హుస్సేన్(54) పాకిస్థాన్ హైకమిషన్ ఇన్‌ఛార్జ్ సాద్ అహ్మద్ వారాయిచ్ అధికారిక నివాసంలో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. వరాయిచ్ నివాసంలో నివాసంలో ఇంటిపని చేస్తున్న వితంతు మహిళపై ఈ దుర్మర్గుడి కన్నుపడింది. బాధిత మహిళఆమె న్యూఢిల్లీలోని తిలక్ మార్గ్‌లోని దౌత్యవేత్త అధికారిక నివాసంలోని సర్వెంట్ క్వార్టర్‌లో నివసిస్తున్నారు. హుస్సేన్ కూడా అక్కడే ఉంటున్నాడు. ఫిబ్రవరిలో భారతదేశానికి వచ్చినప్పటి నుంచి.. అతను మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, లైంగిక సంబంధాలు, అసభ్యకర చర్యలకు పాల్పడుతున్నాడని.. మహిళ అహ్మద్ వారాయిచ్ కి ఫిర్యాదు చేశారు.
READ MORE: AI Pharma Hub : సంగారెడ్డిలో ఏఐ ఆధారిత ఫార్మా హబ్ ద్వారా 50,000 ఉద్యోగాలు
దీంతో అహ్మద్ వారాయిచ్.. బక్రీద్ సాకుతో హుస్సేన్‌ను నిశ్శబ్దంగా పాకిస్థాన్ కు పంపారు. అనంతరం జూన్ 30 లోగా తన ఉద్యోగాన్ని, వారాయిచ్ ఏర్పాటు చేసిన నివాసాన్ని వదిలి వెళ్లాలని పాక్ హైకమిషన్ ఆ మహిళను ఆదేశించింది. బాధిత మహిళ వితంతువు కావడంతో పిల్లల కోసం పని చేయాల్సి వస్తోంది. ఈ వార్త రావడంతో ఆమె ఒక్కసారిగా ఆందోళన చెందారు. పాక్ నుంచి తిరిగి వచ్చిన హుస్సేన్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో.. ఆమె జూన్ 28 న తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా.. ఢిల్లీ పోలీసులు వెంటనే మిన్హాజ్ అహ్మద్ హుస్సేన్‌పై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 354 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. హుస్సేన్ అధికారిక పాస్‌పోర్ట్, వీసాపై భారతదేశంలో నివసిస్తున్నారు. పరిస్థితిని పసిగట్టిన అధికారులు తిరిగి అతడిని స్వదేశానికి పంపారు.