ఢిల్లీ నుంచి ముంబై వస్తున్న భారత ఆటగాళ్లకు ఊహించని ట్విస్ట్ నెలకొంది. ఢిల్లీ నుంచి ముంబైకి భారత ఆటగాళ్లు వచ్చే విమానానికి విస్తార ఎయిర్లైన్స్ UK 1845 నెంబర్ ను కేటాయించింది. విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18, కెప్టెన్ రోహిత్ శర్మ జెర్సీ నెంబర్ 45 ను కలుపుతూ… UK1845 గా కేటాయించింది. ఢిల్లీ నుంచి ముంబై వచ్చే ఆ ప్రయాణాన్ని కోహ్లీ, రోహిత్ శర్మకు అంకితం చేసిన విస్తార ఎయిర్లైన్స్ తన అభిమానాన్ని చాటుకుంది. విమానాశ్రయానికి చేరుకున్న భారత జట్టుకు వాటర్ ఫిరంగి సెల్యూట్ చేశారు. ముంబైలోని భారత జట్టుకు ఘనస్వాగతం పలికేందుకు విమానాశ్రయం వెలుపల అభిమానులు గుమిగూడారు.
READ MORE: Samantha: సమంత నిరక్షరాస్యురాలు.. డాక్టర్ సంచలన వ్యాఖ్యలు
టీ 20 ప్రపంచ కప్ 2024 టైటిల్‌ను గెలుచుకున్న తర్వాత భారత జట్టు జులై 4న బార్బడోస్ నుంచి ఢిల్లీకి చేరుకుంది. ఉదయం విమానాశ్రయంలో దిగిన తర్వాత హోటల్ ఐటీసీ మౌర్యలో బస చేశారు క్రీడాకారులు. అక్కడి నుంచి అనంతరం దేశా ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. అనంతరం ముంబైలోని చారిత్రాత్మక వాంఖడే స్టేడియం నుంచి మెరైన్ డ్రైవ్ మీదుగా నారిమన్ పాయింట్ వరకు ఓపెన్ బస్సులో విజయోత్సవ కవాతు నిర్వహించనున్నారు. ఈ కవాతులో పాల్గొనేందుకు టీమిండియా ఢిల్లీ నుంచి బయలు దేరింది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా.. కవాతు సందర్భంగా వాంఖడే స్టేడియంలో వేలాది మంది ప్రజలు టీమిండియా రాకకోసం ఎదురు చూస్తున్నారు. ప్రేక్షకులు తమ అభిమాన క్రికెటర్ల సంగ్రహావలోకనం పొందడానికి చాలా గుమిగూడారు.