ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ మరోసారి ఢిల్లీ బాట పట్టనున్నారు.. ఉపరాష్ట్రపతి నామినేషన్.. అంతకు ముందు ఎన్డీయే పక్షాల సమావేశం ఎజెండాగా సీఎం చంద్రబాబు.. ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారు. మరోవైపు, పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర మంత్రులతో మాట్లాడేందుకు మంత్రి నారా లోకేష్ కూడా హస్తినకు వెళ్తున్నారు.
ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి చేపట్టిన మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం పార్లమెంట్ భవన్ నుంచి ఈసీ ఆఫీసుకు ర్యాలీ చేపట్టారు.
ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా సోమవారం ఢిల్లీలో ఇండియా కూటమి భారీ ర్యాలీ చేపట్టింది. పార్లమెంట్ భవన్ నుంచి ఈసీ ఆఫీస్‌కు మార్చ్ చేపట్టింది. విపక్ష ఎంపీలంతా ర్యాలీలో పాల్గొన్నారు.
ఎన్నికల సంఘంపై ఇండియా కూటమి యుద్ధానికి దిగింది. గత కొద్ది రోజులుగా ఓట్ల చోరీపై విపక్షాలు ఆందోళనలు, నినసనలు కొనసాగిస్తున్నాయి. బీహార్‌లో అధికార పార్టీకి తొత్తుగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తుందంటూ పార్లమెంట్ వేదికగా విపక్ష పార్టీలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి.
ఢిల్లీలో నూతనంగా నిర్మించిన ఎంపీల నివాస సముదాయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో కలిసి మోడీ ఎంపీల ఫ్లాట్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు.
అసిమ్ మునీర్.. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్. భారత్‌పై నిత్యం విషం కక్కుతూ ఉంటాడు. విదేశాల్లో స్థిరపడిన పాకిస్థానీయులను ఉద్దేశించి మాట్లాడుతూ భారత్‌పై రెచ్చగొట్టే ప్రసంగం చేసిన తర్వాతే పహల్గామ్ ఉగ్ర దాడి జరిగింది.
దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. అర్ధరాత్రి నుంచి కుండపోతగా వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయం అయ్యాయి. నోయిడా, గురుగ్రామ్‌లో భారీ వర్షం కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
భారత్-అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టారిఫ్‌ల విషయంలో ఇరు దేశాల మధ్య సఖ్యత చెడింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ శుక్రవారం హై-లెవల్ సమావేశానికి సిద్ధమయ్యారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. పార్కింగ్ వివాదంలో బాలీవుడ్ నటి హుమా ఖురేషి బంధువు ఆసిఫ్ హత్యకు గురయ్యాడు. ఢిల్లీలోని జంగ్‌పురా ప్రాంతంలో అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, బిజు జనతాదళ్ (బీజేడీ) మాజీ ఎంపీ పినాకి మిశ్రా మే 30న వివాహం జరిగింది. జర్మనీలోని ఒక ప్రైవేటు వేడుకలో ఇద్దరూ ఒక్కటయ్యారు.