Haryana: ఫరీదాబాద్‌లో ఉగ్ర కలకలం… భారీగా మందుగుండు సామగ్రి స్వాధీనం
- ఫరీదాబాద్‌లో ఉగ్ర కలకలం
- భారీగా మందుగుండు సామగ్రి స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాలోని ఫరీదాబాద్‌లో భారీ ఉగ్ర కుట్ర కోణం బయటపడింది. ఒక వైద్యుడి ఇంట్లో 300 కేజీల ఆర్డీఎక్స్, ఒక ఏకే-47 రైఫిల్, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైద్యుడు కాశ్మీర్‌కు చెందిన ముజాహిల్ షకీల్‌గా గుర్తించారు. జమ్మూకాశ్మీర్ ఏటీఎస్ పోలీసుల ఆపరేషన్‌లో ఈ ఉగ్ర కుట్ర బయటపడింది. మూడు రోజుల క్రితం అనంత్‌నాగ్‌లో డాక్టర్ ఆదీల్ అరెస్ట్ అయ్యాడు. ఆదీల్ ఇచ్చిన సమాచారం మేరకు ఫరీదాబాద్‌లో ఈ ఉగ్ర కుట్ర గుట్టురట్టైంది.
ఇది కూడా చదవండి: Odisha: జాజ్‌పూర్‌లో హడలెత్తించిన కీటకాల దండు.. బ్యాలెన్స్ కోల్పోయి కిందపడ్డ బైకర్లు
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ ఆస్పత్రిపై విచారణ సందర్భంగా డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్ అందించిన సమాచారం ఆధారంగా అధికారులు జరిపిన దాడిలో ఈ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ ముజామిల్ షకీల్‌ను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఫరీదాబాద్‌లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు, ఆయుధాలను నిల్వ చేయడంలో సహాయం చేసినట్లు అనుమానిస్తున్న పుల్వామా జిల్లాలోని కోయిల్ నివాసి డాక్టర్ ముజామిల్ షకీల్ ప్రమేయం ఉన్నట్లుగా దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థలైన జైష్-ఎ-మొహమ్మద్, ఘజ్వత్-ఉల్-హింద్‌లతో ఈ వైద్యులకు సంబంధాలు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Trump-BBC: ట్రంప్ ప్రసంగం ఎడిట్‌పై ఇక్కట్లు.. బీబీసీ డైరెక్టర్, సీఈవో రాజీనామా
నిందితులపై ఆయుధ చట్టంలోని సెక్షన్లు 7/25, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA)లోని సెక్షన్లు 13, 28, 38, 39 కింద కేసు నమోదు చేశారు. శీతాకాలం కోసం ఎగువ ప్రాంతాల్లో దాక్కున్న ఉగ్రవాదులు మైదానాల్లో సురక్షితమైన ఆశ్రయాలను వెతుకుతున్నారని నిఘా వర్గాలు సూచించడంతో రాంబన్, కిష్త్వార్, దోడా, కథువా, రియాసి, పూంచ్, రాజౌరి జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో సోదాలు, కార్డన్ డ్రైవ్‌లు జరుగుతున్నాయి. ఈ తనిఖీల్లో భాగంగా ఉగ్ర కుట్రలు వెలుగుచూస్తున్నాయి.
తాజావార్తలు
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!