ముంబై, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. రూ.9 కోట్ల విలువ చేసే 9 కేజీల గంజాయిను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. బ్యాంకాక్ నుంచి ముంబై, ఢిల్లీకి తరలిస్తుండగా ఇద్దరు స్మగ్లర్ల దగ్గర గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
గంజాయిను కేటుగాళ్లు ప్లాస్టిక్ కవర్స్‌లో టైట్ ప్యాకింగ్ చేసి ట్రాలీ బ్యాగ్స్‌లో నింపారు. బట్టలకు బదులుగా గంజాయి తరలిస్తున్నారు. బ్యాంకాక్ నుంచి ఇండియాకు వస్తున్న ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా పరిశీలిస్తుండగా కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డారు. ఇద్దరు స్మగ్లర్లపై ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Bengaluru: దారుణం.. అబ్బాయితో తిరగొద్దన్న పాపానికి తల్లిని చంపిన కుమార్తె
ఇటీవల కూడా భారీగా గంజాయి పట్టుబడింది. అలాగే ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఒక మహిళ దగ్గర నుంచి భారీగా బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అధికారులు ఎంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినా స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు.
ఇది కూడా చదవండి: Allu Sirish Engagement: ఆమెతో అల్లు శిరీష్ నిశ్చితార్థం..