త్వరలో ఎన్నికల సంఘంపై హైడ్రోజన్ బాంబ్ పేల్చబోతున్నట్లుగా ప్రకటించినట్టుగానే గురువారం రాహుల్‌గాంధీ పేల్చారు. ఓట్ల చోరీపై గతంలో కొన్ని ఆధారాలు బయటపెట్టగా.. ఈరోజు మరిన్ని ఆధారాలను బయటపెట్టారు. మీడియా ముందు వీడియో ప్రజెంటేషన్ ఇస్తూ... ఓట్ల చోరీపై 100 శాతం ఆధారాలతో రుజువులు బయటపెడుతున్నట్లు ప్రకటించారు.
ఓట్ల చోరీపై కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై మరో బాంబ్ పేల్చారు. ఉద్దేశపూర్వకంగా లక్షల ఓట్లను ఎన్నికల సంఘం తొలగించిందని తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియా ప్రజెంటేషన్ ఇచ్చారు.
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ సౌదీ అరేబియాలో పర్యటించారు. ఇక రియాద్‌లో సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో షరీఫ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు రక్షణ ఒప్పందం చేసుకున్నాయి. పరస్పరం రక్షణ ఒప్పందంపై సంతకాలు చేసుకున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. బీఎండబ్ల్యూ కారు ఢీకొని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ డిప్యూటీ కార్యదర్శి నవతోజ్ సింగ్ దుర్మరణం చెందారు. హరినగర్ నివాసి అయిన నవతోజ్ సింగ్ ఇంటికి వస్తుండగా బైక్‌ను కారు ఢీకొట్టింది.
ఈనెల 8న దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన మహీంద్రా థార్ కారు ప్రమాదంలో మహిళ చనిపోయినట్లు సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో బాధిత మహిళా ఇన్‌స్టాగ్రామ్‌లో కీలక వీడియో పోస్ట్ చేసింది. తాను చనిపోయినట్లు వస్తున్న వార్తలను ఆమె తోసిపుచ్చింది.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబ్ బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. నిన్నామొన్నటిదాకా పాఠశాలల లక్ష్యంగా ప్రతిరోజూ బాంబ్ బెదిరింపులు వచ్చాయి. తాజాగా ఢిల్లీ హైకోర్టుకు బాంబ్ బెదిరింపు వచ్చింది. దీంతో పోలీసులు, బాంబ్, డాగ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఓ కంత్రీ దొంగ కోటికి పైగా విలువైన బంగారు కలశాలను ఎత్తుకెళ్లిపోయాడు. ఎవరికి అనుమానం రాకుండా పూజారి వేషంలో వచ్చి పాత్రలను ఎత్తుకెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.
దేశ రాజధాని ఢిల్లీని భారీ వరదలు ముంచెత్తాయి. ఇటీవల కురిసిన వర్షాలతో యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇప్పటికే ప్రమాదకర స్థాయిని దాటగా.. ప్రస్తుతం 207.41 మీటర్ల దగ్గర నీటి ప్రవాహం కొనసాగుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈరోజు, రేపు రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో సమావేశాలు ప్రారంభంకానున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. ప్రసాదం వివాదం కారణంగా ఒకరు హత్యకు గురయ్యారు. కొందరు వ్యక్తులు.. ఆలయ సేవకుడిని అత్యంత దారుణంగా కర్రలతో కొట్టి చంపేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యారు. ప్రస్తుతం వైరల్‌గా మారాయి.