గాజా స్వాధీనమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ముందుకు వెళ్తోంది. దీంతో ఐడీఎఫ్ భీకరదాడులు చేస్తోంది. తాజా దాడులు మీడియా సంస్థలు లక్ష్యంగా జరుగుతున్నాయని అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఫిజీ ప్రధాని రబుకా మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో ఫిజీ ప్రధాని రబుకా బృందం ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. సోమవారం నాడు వాణిజ్యం, పెట్టుబడులు వంటి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చలు జరిపినట్లు వర్గాలు పేర్కొన్నాయి.
Six Month-Old Baby Kidnapped in Delhi: రోజురోజుకు కొందరు దుర్మార్గులు పసికందులను, చిన్నారులను ఎత్తుకెళ్లి అమ్ముకుంటున్నారు. వీరికి కొందరు వ్యక్తులతో పాటు ఆస్పత్రుల సిబ్బంది కూడా వారికి సాయం చేస్తున్నారు. చిన్నారుల కిడ్నాప్ లు ఇప్పటికే చాలానే జరిగాయి. తాజాగా దేశరాజధాని ఢిల్లీలో మరో చోటుచేసుకుంది. ఓ దుర్మార్గుడు చిన్నారిని కిడ్నాప్ చేసి 90వేలకు ఆస్పత్రి సిబ్బందికి అమ్మేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఢిల్లీలోని ఒక దుకాణంలో పనిచేస్తున్న ఓ వ్యక్తి సరాయ్ కాలే ఖాన్…
దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ నేత, మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఇంటిపై ఈడీ దాడులు చేస్తోంది. ఆస్పత్రి నిర్మాణ కుంభకోణంలో సౌరభ్ భరద్వాజ్ నివాసం, మరో 12 ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేస్తున్నారు. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో 13 చోట్ల దాడులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రధానమంత్రి కార్యాలయం మంగళవారం అత్యున్నత సమావేశం నిర్వహిస్తోంది. ప్రధాని మోడీకి ప్రధాన కార్యదర్శి ఈ సమావేశానికి నేతృత్వం వహించనున్నారు. బుధవారం నుంచి ట్రంప్ విధించిన 50 శాతం సుంకం అమల్లోకి రానుంది.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భద్రతా లోపం కనిపించింది. బుధవారం ముఖ్యమంత్రి రేఖా గుప్తా నివాసంలో ఒక జంతు ప్రేమికుడు అత్యంత దారుణంగా దాడి చేయడంతో భద్రతా లోపం కొట్టొచ్చినట్లు కనబడింది. తాజాగా పార్లమెంట్ దగ్గర మరోసారి భద్రతా లోపం వెలుగు చూసింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలు పరామర్శించారు. ఈ సందర్భంగా క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మనోజ్ తివారీ కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో తొలిసారి బయటకు వచ్చింది.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబ్ బెదిరింపులు కలకలం రేపాయి. సోమవారం నుంచి వరుసగా ఢిల్లీ స్కూళ్లకు బెదిరింపులు వస్తున్నాయి. ఈమెయిల్స్ ద్వారా బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబ్ బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ వారంలో మరోసారి స్కూళ్లకు బెదిరింపులు వచ్చాయి. బుధవారం ఢిల్లీలోని మాలవీయ నగర్, కరోల్ బాగ్ లోని రెండు పాఠశాలలకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి.