పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. ఉభయ సభలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. వాస్తవానికి సభలు ఆగస్టు 12 వరకు జరగాల్సి ఉండగా.. మూడు రోజుల ముందుగానే సమావేశాలు ముగిశాయి.
తీహార్ జైలు నుంచి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా విడుదలయ్యారు. లిక్కర్ పాలసీ కేసులో సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తీహార్ జైల్లో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సెనాకు లేఖ రాశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15 వేడుకల్లో జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మంత్రి అతిషికి అనుమతి ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
పారిస్‌లో జరిగిన ఒలంపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన మహిళా షూటర్ మను భాకర్ బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. ఉదయం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమెకు భారీ ఘనస్వాగతం లభించింది.
iPhone: తన గర్ల్‌ఫ్రెండ్‌కి గిఫ్ట్ ఇవ్వడానికి ఏకంగా ఓ బాలుడు అమ్మ నగలనే దొంగిలించాడు. 9వ తరగతి చదువుతున్న విద్యార్థి తనతో గర్ల్ ఫ్రెండ్‌కి పుట్టిన రోజున ఐఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చేందుకు బంగారాన్ని చోరీ చేశాడు. ఈ ఘటన నైరుతి ఢిల్లీలోని నజఫ్‌గఢ్ ప్రాంతంలో జరిగింది. ఈ ఆరోపణలపై బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి టీడీపీ ఎంపీ అప్పల నాయుడు ఓ అపురూప కానుకను అందజేశారు. ప్రధానిగా హ్యాట్రిక్ సాధించిన సందర్భంగా చేనేత వస్త్రంపై ఒక చేనేత కుటుంబంలోని దంపతులతో మోడీ లఘు చిత్రాన్ని నేయించారు. చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంపీ స్వయంగా ప్రధానికి బహుకరించారు.
Bangladesh Crisis: ఆందోళనలు కొనసాగుతున్న బంగ్లాదేశ్‌కు ఎయిరిండియా ఇవాళ (బుధవారం) విమానాలను నడుపుతున్నట్లు ప్రకటించింది. ముందే షెడ్యూల్ చేసిన సర్వీసులను యథావిధిగా నిర్వహిస్తామని తెలిపింది.
మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్.కే అద్వానీ ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. దీంతో.. ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. న్యూరాలజీ విభాగంలో చేరిన ఆయన.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అబ్జర్వేషన్లో ఉంచామని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు.