రైతులు ఢిల్లీలోకి ప్రవేశించడానికి ఛాన్స్ లేకుండా రోడ్లపై భారీ బారికేడ్లను ఏర్పాటు చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం ఢిల్లీ నుంచి నడుస్తుంది.. వారు ఢిల్లీకి వెళ్లకపోతే, లాహోర్‌కు పంపించాలా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నేతృత్వంలోని పంజాబ్ రైతులు ‘ఢిల్లీ చలో’ కవాతును ఫిబ్రవరి 13వ తేదీన స్టార్ట్ చేశారు.
NITI Aayog: నీతి ఆయోగ్ 9వ పాలకమండలి మీటింగ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ (శనివారం) ఉదయం రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరగబోతుంది. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్, ఆయన తల్లిదండ్రులను మమత పరామర్శించారు.
దేశ వ్యాప్తంగా న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో మొత్తం 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు.
రేపు ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాల్గొననున్నారు. ఇండియా కూటమికి చెందిన ఇతర ముఖ్యమంత్రుల మాదిరిగానే ఆమె కూడా సమావేశానికి హాజరుకాకుండా ఉంటారా అనే సస్పెన్స్ కు తెర తీసింది. ఈ క్రమంలో.. నీతిఆయోగ్ సమావేశానికి హాజరవడం కోసం శుక్రవారం ఆమె కలకత్తా నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి హస్తిన పర్యటనకు బయల్దేరి వెళ్లారు.. రేపు ఢిల్లీ వేదికగా జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొననున్నారు సీఎం.. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే నీతి ఆయోగ్ భేటీలో ఏపీ అభివృద్ధిపై ప్రస్తావించబోతున్నారు.
నీట్‌పై సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. నీట్ యూజీ 2024 రివైజ్డ్ ఫలితాలను మళ్లీ విడుదల చేసింది. ఫిజిక్స్‌లో అస్పష్టమైన ప్రశ్న తలెత్తింది.
ముంబైలో వర్షం కురుస్తోంది. అక్కడి రోడ్లు, వీధులు, చౌరస్తాలన్నీ నీట మునిగాయి. అరేబియా సముద్రం ఉప్పొంగుతోంది. నీటి ప్రవాహం కారణంగా.. ముంబై హార్ట్‌లైన్ అంటే లోకల్ రైళ్లు ఆగిపోయాయి.
YS Jagan Mohan Reddy: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు చేస్తున్న దాడులు, హింసాత్మక ఘటనలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర వైఎస్సాఆర్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ధర్నా చేస్తున్నాడు. అయితే, జగన్ ధర్నాకు పలు పార్టీలకు చెందిన నేతలు మద్దతు ఇస్తున్నారు.