Iran War: భారత్ అంటే ఇది.. యుద్ధం వేళ హార్ముజ్‌ను దాటిన ఆయిల్ ట్యాంకర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran War: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తలు నెలకొన్నాయి. దీంతో ఇరాన్ చమురు రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని మూసేసింది. బుధవారం భారత్‌కు వస్తున్న కార్గో షిప్‌పై ఇరాన్ అటాక్ చేసింది. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఇండియా-ఇరాన్ మధ్య దౌత్య చర్చలు ఫలించాయి. హార్ముజ్‌లో చిక్కుకున్న భారత ట్యాంకర్లకు ఇరాన్ పర్మిషన్ ఇచ్చింది.
దీంతో, యుద్ధం ప్రారంభమైన తర్వాత హార్ముజ్ దాటిన తొలి నౌకగా భారత నౌక చరిత్ర సృష్టించింది. లైబీరియన్ జెండా కలిగిన చమురు ట్యాంకర్ ముంబై ఓడరేవుకు చేరుకుంది. సౌదీ అరేబియాలోని రాస్ తనురా ఓడరేవులో ముడి చమురు లోడ్‌ను మోసుకెళ్తున్న ట్యాంకర్ షెన్‌లాంగ్ సూయెజ్‌మాక్స్ బుధవారం ఇరాన్ నౌకను ఇరుకైన జలమార్గం గుండా వెళ్ళడానికి అనుమతించిన తర్వాత ముంబైకి చేరుకుందని ముంబై పోర్ట్ ట్రస్ట్ తెలిపింది.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
Read Also: Monalisa: మాది లవ్ జిహాద్ కాదు..ప్రతి మతాన్ని సమానంగానే భావిస్తా!
రెండు దేశాల విదేశాంగ మంత్రులు ఎస్ జైశకంకర్, అబ్బాస్ అరఘ్చి మధ్య జరిగిన చర్చల తర్వాత చమురు ట్యాంకర్లు హార్ముజ్ జలసంధిని దాటడానికి అనుమతినిచ్చినట్లు తెలుస్తోంది. బ్రవరి 28న టెహ్రాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సైనిక ప్రచారం ప్రారంభమైనప్పటి నుండి ఇరాన్ జలసంధిని పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడింది. ఈ మార్గం మూసేయడంతో ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు వినియోగదారుడైన భారత్ ప్రత్యామ్నాయాలను అన్వేషించాల్సి వచ్చింది. దీంతో రష్యా నుంచి కొనుగోళ్లు కూడా పెరిగాయి.
షిప్పింగ్ మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. 28 భారతీయ జెండా కలిగిన నౌకలు ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో పనిచేస్తున్నాయని తెలిపింది. వీటిలో, 677 మంది భారతీయ నావికులతో కూడిన 24 నౌకలు హోర్ముజ్ జలసంధికి పశ్చిమాన ఉన్నాయి, నాలుగు నౌకలు మరియు 101 మంది భారతీయ నావికులు జలసంధికి తూర్పున ఉన్నాయి. భారతీయ నౌకలు, నావికుల భద్రతను నిశితంగా పరిశీలిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతకుముందు, బుధవారం కాండ్లా ఓడరేవుకు వస్తున్న థాయ్ నౌకపై హార్ముజ్‌లో దాడి జరగింది. దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హార్ముజ్‌లో ఇప్పటి వరకు 16 నౌకలపై దాడి జరిగింది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..