మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్.కే అద్వానీ ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. దీంతో.. ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. న్యూరాలజీ విభాగంలో చేరిన ఆయన.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అబ్జర్వేషన్లో ఉంచామని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
Kejriwal: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది.
Supreme Court : ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్లో జూలై 27న ఘోర ప్రమాదం జరిగింది. కోచింగ్ సెంటర్ బేస్మెంట్ నీటమునిగింది. ఇందులో ఐఏఎస్ పరీక్షకు సిద్ధమవుతున్న ముగ్గురు విద్యార్థులు మరణించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ మంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది.
MLC Kavitha: మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను కేటీఆర్, హరీష్ రావు కలవనున్నారు. ఈ మేరకు వారిద్దరూ ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు.
దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో గవర్నర్ల సదస్సు జరిగింది. ఈ సదస్సులో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు హాజరయ్యారు
ఓ విద్యా కుసుమం అర్ధాంతరంగా నేలరాలిపోయింది. ఉన్నతమైన కొలువును సంపాదించేందుకు మహోన్నతమైన ఆశయంతో మహా నగరానికి పోతే.. చివరికి మధ్యలోనే జీవిత ప్రయాణం ముగిసిపోయింది. ఈ ఘోరం దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.
BC-OBC Reservations: సమగ్ర కుల గణన, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్స్ పెంపును డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు దీక్షకు పిలుపునిచ్చాయి. ఈ నెల 7, 8 తేదీల్లో ఢిల్లీలో బీసీ, ఓబీసీ విద్యార్థి నేతల నిరసన చేసేందుకు రెడీ అవుతున్నారు.
Delhi: గుండె జబ్బుతో బాధపడుతున్న రోగికి బ్రెయిన్ డెడ్తో మరణించిన మరొకరి గుండెను రికార్డు సమయంలో అమర్చారు. కాలంతో జరుగుతున్న పరుగు పందెంలో గుండెను కోల్కతా నుంచి ఢిల్లీకి తరలించారు. దీని కోసం కోల్కతా, ఢిల్లీ పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి గురుగ్రామ్లోని ఫోర్టిస్ ఆస్పత్రికి చేర్చారు. మృత్యువు అంచున ఉన్న 34 ఏళ్ల వ్యక్తికి భారీ ఆపరేషన్ నిర్వహించి, కొత్త గుండెను అమర్చారు.