ఢిల్లీలోని అమన్ విహార్ ప్రాంతంలో ఓ మైనర్ తన తండ్రిని పైపుతో కొట్టాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వీధిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న 50 ఏళ్ల వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించారు. పోలీసులు హత్య
కేసు నమోదు చేశారు. కాగా.. కొడుకు 16 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
READ MORE: Test Cricket: ఒకే టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసి 5 వికెట్లు తీసిన ఆటగాళ్లు ఎవరో తెలుసా..?
బీహార్‌కు చెందిన 50 ఏళ్ల వ్యక్తి తన భార్య, ముగ్గురు కుమారులతో కలిసి అమన్ విహార్ ప్రాంతంలో నివసించాడు. అతను వెల్డింగ్ పనులు చేసేవాడు. అతని 16 ఏళ్ల కుమారుడు ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం ఉదయం 7.30 గంటలకు అమన్ విహార్ ప్రాంతంలో జరిగిన గొడవ గురించి పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా వీధిలో ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అతని తల నుంచి రక్తం కారుతోంది. సమీపంలో ఒక ఇనుప పైపు పడి ఉంది. పోలీసులు వెంటనే గాయపడిన వ్యక్తిని సమీపంలోని సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపారు.
పోలీసులు సంఘటనా స్థలానికి క్రైమ్, ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించారు. అక్కడి నుంచి బృందం పలు ఆధారాలు సేకరించింది. విచారణలో మృతుడు మద్యానికి బానిసైనట్లు పోలీసులు గుర్తించారు. మద్యం సేవించి తరచూ భార్యను కొట్టేవాడు. ఆదివారం ఉదయం భార్యతో గొడవపడగా కుమారుడు అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఇంతలో కోపంతో తండ్రిపై పైపుతో దాడి చేశాడు. తండ్రి తనను తాను రక్షించుకునేందుకు వీధిలోకి వచ్చాడు. మైనర్ కొడుకు తల, మెడపై పైపుతో దాడి చేశాడు. దీంతో మృతి చెందాడు. ఈ కేసుపై పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు.