Minister TG Bharath: ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్.. నీతి ఆయోగ్ సీఈఓ బి.వి.ఆర్ సుబ్రహ్మణ్యంను కలిశారు. ఉత్పాదక రంగంలో ఆంధ్రప్రదేశ్ సాధించిన పురోగతితో పాటు విజన్ 2047తో పాటు రానున్న ఐదేళ్లలో రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలపై చర్చించారు. దీంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అనేక అంశాలపై వివరంగా బి.వి.ఆర్ సుబ్రహ్మణ్యంతో మాట్లాడినట్లు మంత్రి టి.జి భరత్ చెప్పారు. పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను పెంపొందించడం, పెట్టుబడులను ఆకర్షించడం, ఆవిష్కరణలను పెంచడంపై ఆయనతో జరిగిన చర్చ ఎంతో ప్రభావం చూపిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 2047 విజన్‌తో ముందుకు వెళుతున్నామన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు.
Read Also: Telangana Cabinet: హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలివే..