Manish Sisodia: కొడుకు కాలేజీ ఫీజుల కోసం అడుక్కున్న: మనీష్ సిసోడియా
- కొడుకు కాలేజీ ఫీజుల కోసం 'భిక్షాటన' చేశా
- బీజేపీ నుంచి నాకు ఆఫర్ వచ్చింది
- రాముడి నుంచి లక్షణుడిని విడదీయలేరని నేను వారికి చెప్పా
- 'జనతా కీ అదాలత్'లో మనీష్ సిసోడియా వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆదివారం తన పాత రోజులను గుర్తుచేసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ ‘స్కామ్’లో తనను అరెస్టు చేసిన సమయంలో.. ఈడీ తన బ్యాంక్ ఖాతాను స్తంభింపజేసిందని, ఈ కారణంగా అప్పు చేయాల్సి వచ్చిందన్నారు. తన కొడుకు కాలేజీ ఫీజు కోసం కూడా ‘భిక్షాటన’ చేయవలసి వచ్చిందన్నారు. మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. ‘‘2002లో నేను జర్నలిస్టుగా ఉన్నప్పుడు రూ. 5 లక్షల విలువైన ఫ్లాట్‌ను కొనుగోలు చేశాను. దాన్ని లాక్కున్నారు. నా ఖాతాలో రూ.10 లక్షలు ఉన్నాయి. అది కూడా విత్‌డ్రా అయిపోయింది. నా కొడుకు ఫీజు కట్టేందుకు సాయం చేయమని వేరేవాళ్లని వేడుకున్నా.” అని ఆయన వ్యాఖ్యానించారు.
READ MORE: Bhagwant Mann: ఖలిస్తానీ మద్దతుదారు అమృత్ పాల్ సింగ్ నుంచి పంజాబ్ సీఎంకి ప్రాణహాని..
Also Read
ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో సిసోడియా ఇటీవలే సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందారు. ఫిబ్రవరి 2023లో సిసోడియాను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టులో ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉండగా.. ఆదివారం ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిర్వహించిన ‘జనతా కీ అదాలత్’లో ఈ విషయాలను మనీష్ పంచుకున్నారు. కేజ్రీవాల్‌తో తనకున్న అనుబంధాన్ని ‘రామ్ అండ్ లక్ష్మణ్’గా అభివర్ణించారు. సిసోడియా మాట్లాడుతూ.. “నాకు బిజెపిలో చేరడానికి ఆఫర్ వచ్చింది. అనారోగ్యంతో ఉన్న నా భార్య, నా కొడుకు గురించి ఆలోచించమని బీజేపీ నేతలు చెప్పారు. మీరు లక్ష్మణుడిని రాముడి నుంచి వేరు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలా చేసే శక్తి ఏ రావణుడికీ లేదు.” అని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!