UP: మరో ఉద్యోగిని బలి తీసుకున్న పని ఒత్తిడి.. హెచ్‌డీఎఫ్‌సీ ఎంప్లాయి అనుమానాస్పద మృతి!
- దేశంలో మరో విషాద ఘటన
- పని ఒత్తిడి కారణంగా మరో ఉద్యోగి మృతి
- కుర్చీలోనే చనిపోయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉద్యోగి సదాఫ్ ఫాతిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పని ఒత్తిడి కారణంగా ఉద్యోగులు మరణించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ఈవై ఉద్యోగిని అధిక పని కారణంగా తనువు చాలించింది. ఈ ఘటన యావత్తు భారతీయల హృదయాలను కలిచి వేసింది. కనీసం ఆమె అంత్యక్రియలకు ఒక్క ఎంప్లాయి కూడా హాజరు కాలేదు. ఈ అంశం మరింత దిగ్భ్రాంతి కలిగించింది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో కూడా ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. పని ఒత్తిడి కారణంగా కార్యాలయంలోనే ఊపిరి వదిలింది. తాజాగా ఇది రెండో మరణం కావడంతో.. పని పేరుతో కార్యాలయాల్లో ఉద్యోగులు ఎంత ఒత్తిడికి గురవుతున్నారో అన్న అంశంపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: Badlapur Encounter: ‘‘ఇది ఎన్‌కౌంటర్ కాదు’’.. బద్లాపూర్ కేసులో హైకోర్టు ఆగ్రహం..
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని విభూతిఖండ్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉద్యోగి సదాఫ్ ఫాతిమా (45) పని చేస్తూనే ప్రాణాలు వదిలింది. కుర్చీ పైనుంచి కిందపడిన వెంటనే మరణించింది. దీంతో తోటి ఉద్యోగులు షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టానికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టు తర్వాత ఫాతిమా మరణంపై స్పష్టత వస్తుందని విభూతిఖండ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాధారామన్ సింగ్ తెలిపారు. అనుమానాస్పద స్థతిలో మరణించినట్లుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. పని ఒత్తిడి కారణంగానే ఫాతిమా చనిపోయిందని సహచర ఉద్యోగులు వాపోయారు.
ఇది కూడా చదవండి: Tirumala Laddu: ఏఆర్ డెయిరీకి టీటీడీ షాక్.. నెయ్యి వ్యవహారంలో పోలీసులకు ఫిర్యాదు
ఇక ఇదే అంశంపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. ఇది అత్యంత ఆందోళనకర అంశం అని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో కార్యాలయాల్లో పని ఒత్తిడి పెరిగిందని తెలిపారు. కంపెనీలు, ప్రభుత్వ కార్యాలయాలు పని ఒత్తిడిపై పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. తాజా విషాదాన్ని చూసైనా కంపెనీలు, ప్రభుత్వ విభాగాలు ఆలోచించాలని కోరారు. ఇలాంటి ఘటనలు మానవ మనుగడకు తీరని నష్టమని అఖిలేష్ ఎక్స్‌లో పోస్టు చేశారు.
ఇది కూడా చదవండి: Devara Pre-release Event: దేవర ఈవెంట్ పై KTR కీలక వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే ఈవై ఉద్యోగిని మృతిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పిల్లలను చదువుతో పాటే పని ఒత్తిడిని తట్టుకునేలా తయారు చేయాలని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై విపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పించాయి.
लखनऊ में काम के दबाव और तनाव के कारण एचडीएफ़सी की एक महिलाकर्मी की ऑफिस में ही, कुर्सी से गिरकर, मृत्यु का समाचार बेहद चिंतनीय है।
ऐसे समाचार देश में वर्तमान अर्थव्यवस्था के दबाव के प्रतीक हैं। इस संदर्भ में सभी कंपनियों और सरकारी विभागों तक को गंभीरता से सोचना होगा। ये देश के… pic.twitter.com/Xj49E01MSs
— Akhilesh Yadav (@yadavakhilesh) September 24, 2024
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!