దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. లిక్కర్ కేసులో తీహార్ జైలు నుంచి సీఎం కేజ్రీవాల్ విడుదలైన తర్వాత హస్తిన రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి రెడీ అయ్యారు. మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాను కేజ్రీవాల్ కలిసి రాజీనామా సమర్పించనున్నారు.
ఎక్సైజ్ పాలసీ ‘స్కాం’ కేసులో సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందిన రెండు రోజుల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమైన అనంతరం సీఎం కేజ్రీవాల్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ పెద్ద ప్రకటన చేస్తూ.. ‘రెండు రోజుల తర్వాత సీఎం పదవికి రాజీనామా చేస్తాను’ అని ప్రకటించారు. READ MORE: Bhupathiraju Srinivasa Varma: విశాఖ స్టీల్…
Water Leakage At Taj Mahal: దేశ రాజధాని ఢిల్లీకి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆగ్రాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా తాజ్ మహల్ వద్ద నీరు లీకేజీ అయింది.
ఢిల్లీలో సీతారాం ఏచూరి పార్థివ దేహానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ ఎంపీలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సీతారాం ఏచూరి మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నానని తెలిపారు. మంచి నాయకుడు, ఎల్లప్పుడూ పేద ప్రజలకు ఏం చేయాలని తపనపడే వ్యక్తి అని అన్నారు. తాను 40 సంవత్సరాలుగా క్లోజ్ గా సీతారాం ఏచూరిని వాచ్ చేశానని.. ఏచూరితో కలిసి పని చేశానని చంద్రబాబు చెప్పారు.
మద్యం విధానానికి సంబంధించిన అవకతవకల వ్యవహారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట దొరికింది. లిక్కర్ కుంభకోణం కేసులో ఎట్టకేలకు బెయిల్ లభించింది.
ప్రముఖ రాజకీయ ఉద్దండుడు, వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. ఎక్స్ ట్విట్టర్ వేదికగా ఏచూరికి మోడీ సంతాపం వ్యక్తం చేశారు.
ప్రముఖ రాజకీయ ఉద్దండుడు, వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా ఢిల్లీ ఎయిమ్స్‌లో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్పై చికిత్స తీసుకుంటున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో గురువారం మధ్యాహ్నం 3:05 గంటలకు కన్నుమూసినట్లుగా ఎయిమ్స్ వైద్యులు ఒక ప్రకటనలో తెలిపారు.
కమ్యూనిస్ట్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన సీతారాం ఏచూరి జీవిత విశేషాలు గురించి తెలుసుకుందాం. సీతారాం ఏచూరి తండ్రి ఏపీఎస్ ఆర్టీసీలో ఇంజినీర్ ఉద్యోగం చేసేవాడు.. ఆయన తల్లి ప్రభుత్వ ఉద్యోగిగా పని చేశారు. 1992 నుంచి ఏచూరి సీపీఎంలో పొలిట్‌బ్యూరో సభ్యుడుగా పనిచేశారు.
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. కాగా.. కొన్ని రోజుల క్రితయం ఆయన ఫీవర్, లంగ్స్ ఇన్ఫెక్షన్ తో ఆగస్టు 19న ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. సీతారాం ఏచూరి మృతితో కమ్యూనిస్ట్ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.