ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆదివారం తన పాత రోజులను గుర్తుచేసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ 'స్కామ్'లో తనను అరెస్టు చేసిన సమయంలో.. ఈడీ తన బ్యాంక్ ఖాతాను స్తంభింపజేసిందని, ఈ కారణంగా అప్పు చేయాల్సి వచ్చిందన్నారు.
అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా తర్వాత.. కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రిగా 'అతిషి' ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ సెక్రటేరియట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అతిషి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్.. నీతి ఆయోగ్ సీఈఓ బి.వి.ఆర్ సుబ్రహ్మణ్యంను కలిశారు. ఉత్పాదక రంగంలో ఆంధ్రప్రదేశ్ సాధించిన పురోగతితో పాటు విజన్ 2047తో పాటు రానున్న ఐదేళ్లలో రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలపై చర్చించారు.
దేశ రాజధాని ఢిల్లీలోని పితంపుర మెట్రో స్టేషన్లో ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో కదులుతున్న మెట్రో ముందు దూకింది. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.
కేంద్రానికి ఆమ్ ఆద్మీ పార్టీ లేఖ రాసింది. కేజ్రీవాల్కు వసతి కల్పించాలని కోరింది. దీని కోసం సుదీర్ఘ న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం ఉండబోదని ఆశిస్తున్నట్లు ఆప్ పేర్కొంది.
పోలీసు అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఒక నేరస్థుడు తన ప్రాణాలనే పోగొట్టుకున్నాడు. తనను పోలీసులు పట్టుకుంటారని తెలుసుకుని.. ఓ నేరస్థుడు ఢిల్లీలోని యమునా క్రాసింగ్ ఏరియాలోని ఫ్లై ఓవర్పై నుంచి దూకేశాడు. అతన్ని ఆసుపత్రికి తరలించగా, అక్కడ మరణించాడు. గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది.
ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందు.. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కొత్తగా ఎన్నికకానున్న ముఖ్యమంత్రికి పని అప్పగించారు. అపరిశుభ్రతకు సంబంధించి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. దీనిపై దృష్టి పెట్టాలని కోరారు. పశ్చిమ ఢిల్లీలో లక్షలాది మంది ప్రజలు నరకం కంటే హీనమైన జీవితాన్ని గడపాల్సి వస్తోందని ఎల్జీ పేర్కొన్నారు.
Viral Video : వికాస్పురిలో బైక్పై అమ్మాయితో స్టంట్స్ చేసిన యువకుడిని ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. సీసీ కెమెరాల సాయంతో 24 గంటల్లో యువకుడు, యువతిని పోలీసులు గుర్తించారు.
Delhi New CM: ఢిల్లీ ముఖ్యమంత్రిగా సెప్టెంబర్ 21వ తేదీన అతిషి మర్లెనా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అతిషితో ముఖ్యమంత్రిగా ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా ప్రమాణ స్వీకారం చేయుంచనున్నారు.
సెప్టెంబర్ 21న ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అతిషి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు సంబంధించి.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణ స్వీకారం గురించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తెలియజేసారు. ఈ క్రమంలో.. అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్కి తన రాజీనామాను సమర్పించారు. అతిషి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దావా వేశారు.