నితిన్ గడ్కరీతో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.. జాతీయ రహదారులపై కేంద్ర మంత్రిత్వ సమీక్ష జరిపాం అన్నారు.. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న పనులకు ఉన్న భూ సేకరణ సహా అడ్డంకులపై చర్చించాం.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలు, రహదారులకు ఉన్న అడ్డంకులు, సమస్యలను పరిష్కరించి ముందుకు వెళ్తున్నాం అని వివరించారు.. అయితే, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ CRF కింద మరింత అదనపు నిధులు ఇస్తామన్నారని వెల్లడించారు..
కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో జమిలి ఎన్నికలకు మార్గం సుగమం అవుతున్నట్లు కనిపిస్తోంది.
MP Sanjay Singh: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన అధికారిక నివాసాన్ని వారం రోజుల్లో ఖాళీ చేస్తారని.. ప్రభుత్వ సౌకర్యాలన్నింటినీ వదులుకుంటారని ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఈరోజు (బుధవారం) తెలిపారు.
Building Collapses in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఓ భవనం కుప్పకూలిపోయింది. కరోల్‌బాగ్‌లోని ప్రసాద్ నగర్ ఏరియాలో రెండంతస్తుల నివాస భవనంలోని ఓ భాగం ఈరోజు (బుధవారం) కూలింది. దీంతో అనేక మంది శిథిలాల కింద చిక్కుకుని పోయారు.
ప్రధాని మోడీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఈసారి అగ్రరాజ్యం అమెరికాలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు మోడీ యూఎస్‌లో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 21-23 మధ్య అమెరికాలో ప్రధాని మోడీ ఉన్నారు. క్వాడ్ మీట్లో మోడీ పాల్గొంటారు.
ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్‌కు నైతిక విలువలు ఉండుంటే.. అరెస్ట్ అయినప్పుడే రాజీనామా చేసేవారని వ్యాఖ్యానించారు. రాజ్‌నాథ్ సింగ్ ఓ మీడియా సంస్థతో మాట్లాడారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనాకు సమర్పించారు. అతిషితో కలిసి కేజ్రీవాల్ మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. అనంతరం కేజ్రీవాల్ రిజైన్ లెటర్.. వీకే.సక్సేనాకు అందజేశారు.
ప్రధాని మోడీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే లేఖ రాశారు. ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని లేఖలో ఖర్గే కోరారు. క్రమశిక్షణ లేని నాయకులను నియంత్రించాలని కోరుతున్నానని.. భారతీయ రాజకీయాలు పతనం కాకుండా ఉండాలంటే తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Atishi: ఢిల్లీ లిక్కర్ కేసులో నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయబోతున్నారు. ఈ రోజు జరిగిన ఆప్ శానససభ పక్ష సమావేశంలో ఢిల్లీకి కొత్త సీఎంగా అతిషీ మార్లేనాని ఆప్ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రిగా ఖరారైన తర్వాత తొలిసారిగా అతిషీ స్పందించారు. కేజ్రీవాల్‌ని తన గురువుగా అభివర్ణించారు. తదుపరి ఎన్నికల్లో కేజ్రీవాల్‌ని సీఎం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.
ప్రధాని మోడీ మంగళవారం 74వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఇందుకోసం దేశ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రధాని మోడీకి వచ్చిన బహుమతులను సెప్టెంబర్ 17న వేలం వేయనున్నాయి. ఈ మేరకు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వెల్లడించారు.