ఢిల్లీలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడి గర్ల్ ఫ్రెండ్ తన చేతి మణికట్టు కోసుకుని దాన్ని వీడియో తీసి ప్రేమికుడికి పంపించింది. ఆ యువకుడు ఆస్పత్రికి పరిగెత్తగా.. ప్రియురాలి పరిస్థితి చూసి స్పృహతప్పి పడిపోయాడు. అతడిని కూడా అక్కడే చేర్చగా, పరీక్షల అనంతరం చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీలోని షహదారా ప్రాంతంలో నివసిస్తున్న 30 ఏళ్ల యువకుడు అరుణ్ నందాకి తన ప్రియురాలు మణికట్టు కోసుకుంటున్న వీడియోను పంపింది. దీంతో ఆ యువకుడు తన స్నేహితురాలిని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ ఈ ఘటన చోటుచేసుకుంది.
READ MORE: Kadapa: బద్వేల్ ఇంటర్ విద్యార్థిని ఘటన కేసులో సంచలన విషయాలు..
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. యువకుడి మరణానికి కారణం గుండెపోటు కావచ్చునని పోలీసులు ఆదివారం తెలిపారు. అయితే పోస్ట్‌మార్టం నివేదిక ఇంకా రావాల్సి ఉంది. పోలీసుల సమాచారం ప్రకారం… ఈ సంఘటనపై శనివారం రాత్రి 3:34 గంటలకు ఆనంద్ విహార్ పోలీస్ స్టేషన్‌కు పిసిఆర్ కాల్ వచ్చింది. ఒక వ్యక్తి కైలాష్ దీపక్ ఆసుపత్రిలో చేరినట్లు కాల్‌లో చెప్పారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే అరుణ్ నందా మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. జగత్‌పురి నివాసి అయిన అరుణ్ స్నేహితురాలు మణికట్టు కోసే వీడియోను అతనికి పంపినట్లు విచారణలో తేలిందని పోలీసు అధికారి తెలిపారు. వీడియో చూసిన అరుణ్ భయపడి వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే, తన ప్రియురాలి పరిస్థితిని చూసి, అరుణ్ పరిస్థితి విషమించి, ఆసుపత్రిలో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆ తర్వాత అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రియురాలికి ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. అరుణ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించామని పోలీసులు చెబుతున్నారు. పోస్ట్‌మార్టం సమయంలో వైద్యులు అరుణ్ విసెరాను కూడా భద్రపరిచారు. తద్వారా తదుపరి దర్యాప్తు కొనసాగించవచ్చని తెలిపారు. పోస్టుమార్టం అనంతరం అరుణ్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ కేసును మొదట కార్డియాక్ అరెస్ట్ కేసుగా పరిగణించినప్పటికీ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
READ MORE:RSS: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీకి అండగా రంగంలోకి దిగిన ఆర్ఎస్ఎస్..