Delhi : ఢిల్లీలోని రంగపురి ప్రాంతంలో ఓ తండ్రి తన నలుగురు కూతుళ్లతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. 50 ఏళ్ల హీరా లాల్ తన కుటుంబంతో కలిసి రంగ్పురి ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసించాడు.
Rani Laxmibai: షాహీ ఈద్గా సమీపంలోని పార్క్లో రాణి ఝాన్సీ లక్ష్మీబాయి విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని వక్ఫ్ బోర్డు వ్యతిరేకించినందుకు ఢిల్లీ షాహీ ఈద్గా మేనేజింగ్ కమిటీపై హైకోర్టు తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. దీంతో శుక్రవారం కోర్టుకు ముస్లిం సంఘం క్షమాపణలు చెప్పింది.
బీజేపీకి చెందిన సుందర్ సింగ్ తన్వర్ ఢిల్లీ మున్సిపల్ స్టాండింగ్ కమిటీ సీటును కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి సుందర్ సింగ్ 115 ఓట్లు గెలుచుకోగా.. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థికి ఒక్క ఓటు కూడా రాలేదు. ఆప్ అధిష్ఠానం నిర్ణయం మేరకు ఆ పార్టీ కౌన్సిలర్లు ఈ ఎన్నికలను బహిష్కరించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోడీని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. తమిళనాడు మెట్రో ప్రాజెక్ట్లకు అందించాల్సిన నిధులు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు నిధులు విడుదల చేశారని.. తమిళనాడు నిధులు కూడా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషికి ఢిల్లీ పోలీసులు జెడ్ కేటగిరీ భద్రత కల్పించారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు అతిషికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ వర్తిస్తుంది. ప్రోటోకాల్ ప్రకాశం ఆమె కాన్వాయ్లో ఇకపై పైలట్ సహా పోలీసు సిబ్బందితో భద్రత కల్పించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
పని ఒత్తిడి కారణంగా ఉద్యోగులు మరణించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ఈవై ఉద్యోగిని అధిక పని కారణంగా తనువు చాలించింది. ఈ ఘటన యావత్తు భారతీయల హృదయాలను కలిచి వేసింది. కనీసం ఆమె అంత్యక్రియలకు ఒక్క ఎంప్లాయి కూడా హాజరు కాలేదు. ఈ అంశం మరింత దిగ్భ్రాంతి కలిగించింది.
MLC Kavitha: నేడు ఢిల్లీ కోర్టులో లిక్కర్ స్కామ్ కేసు విచారణకు రాబోతుంది. ఈ సందర్భంగా రౌస్ అవెన్యూ కోర్టులో లిక్కర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై విచారణ కొనసాగనుంది. ఈ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు ఇతర నిందితులు హాజరు కానున్నారు.
Atishi: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి అతిషీ మర్లెనా ఈరోజు (సోమవారం) బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఆయన కోసం పక్కన ఓ కుర్చీని ఉంచడంతో పాటు తాను వేరే సీట్లో కూర్చోని బాధ్యతలు చేపట్టారు.
నలుగురు కొత్త మంత్రుల చేత పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా ఈరోజు (సోమవారం) సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. గులాబ్ చంద్ కటారియా పంజాబ్ గవర్నర్ అయిన తర్వాత కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించడం ఇదే ఫస్ట్ టైం.
Delhi CM Atishi: ఈ నెల 21వ తేదీన (శనివారం) ఢిల్లీ రాష్ట్ర ఎనిమిదో ముఖ్యమంత్రిగా అతిషి మర్లెనా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, ఈరోజు (సోమవారం) ఆమె సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.