ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన రెండో రోజు కొనసాగుతోంది.. తొలిరోజు బిజీబిజీగా గడిపిన ఆయన.. ఈ రోజు కూడా వరుసగా కేంద్ర మంత్రులను కలవనున్నారు.. ఇవాళ మొదటగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఈ భేటీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు..
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. బుడమేరు వరదలపై నివేదిక తర్వాత తొలిసారి ప్రధానిని కలిశారు. వరద సాయం, రైల్వే జోన్ ఏర్పాటు, విశాఖ ఉక్కును స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం, అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధుల విధులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడటం, పోలవరం నిర్మాణానికి నిధులు విడుదలపై ప్రధానితో చంద్రబాబు చర్చిస్తున్నట్లు సమాచారం.
కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని సహా కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. సాయంత్రం 4.45గంటలకు ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. సాయంత్రం 6:15కి రైల్వే, సమాచార ప్రసారాల శాఖల మంత్రి అశ్వని వైష్ణవ్‌తో భేటీ కానున్నారు.
High Alert in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్ జారీ చేశారు. దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని సమాచారం ఢిల్లీ పోలీసులను నిఘా వర్గాలు అందించాయి.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు కేంద్ర మంత్రి అమిత్ షా అధ్యక్షతన మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో జరిగే సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల సీఎంల సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
ఢిల్లీ మెట్రోలో టిక్కెట్లు లేకుండా ప్రయాణించే ఉదంతాలు చాలాసార్లు వెలుగులోకి వచ్చాయి. చాలా సార్లు మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు ఫ్లోర్‌పై కూర్చోవడం కనిపిస్తుంది. టికెట్ లేకుండా ప్రయాణించడం, ఫ్లోర్‌పై కూర్చోవడం, జరిమానా కూడా విధించే విషయంలో మెట్రో నిబంధనలు రూపొందించింది.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. శుక్రవారం అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి ఆప్ పార్టీ నేత ఇంట్లోకి మకాం మార్చారు. ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్ నివాసాన్ని ఖాళీ చేసి లుటియన్స్ జోన్‌లోని కొత్త చిరునామాకు మారారు.
Vande Bharat Train: ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై గురువారం (అక్టోబర్ 3) రాళ్లదాడి జరిగింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రైలుపై రాళ్లు రువ్వడం చేసారు. ఈ ఘటనలో రైలు కోచ్ కిటికీలు పగిలిపోయాయి. అయితే ప్రయాణికులెవరూ గాయపడలేదు. వారణాసి నుండి ఢిల్లీకి వెళ్తున్న రైలు నంబర్ 22435 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కాన్పూర్ లోని పంకీ స్టేషన్‌కు చేరుకున్నప్పుడు, కొంతమంది దానిపై రాళ్లు వేశారు. Biggboss 8: మిడ్…
దేశ రాజధానిలోని రోడ్ల పరిస్థితులను ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి సోమవారం పరిశీలించారు. అనంతరం దీపావళి వరకు ఢిల్లీలో గుంతలు లేని రోడ్లను ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చారు. నేటి నుంచి వారం రోజులపాటు ఢిల్లీలోని 1400 కిలోమీటర్ల రోడ్లను ముఖ్యమంత్రి, మంత్రులు పరిశీలించనున్నారు. గుంతల రోడ్లను గుర్తించి మరమ్మతులు, రిపేర్లకు ఢిల్లీ సర్కార్ ఆదేశాలు ఇవ్వనుంది
committed Suicide Case: ఢిల్లీలో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. వసంత్ కుంజ్‌లోని రంగపురి ప్రాంతంలో నలుగురు కూతుళ్లతో సహా ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పరిశీలిస్తే రెండు మూడు రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ ఘ్తనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. ఢిల్లీలోని రంగ్‌పురి ప్రాంతంలో ఓ తండ్రి తన నలుగురు వికలాంగ కుమార్తెలతో…