ఢిల్లీ అంతర్జాతీయ పోస్టాఫీసులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఆఫ్రికా నుండి ఢిల్లీ వచ్చిన ఓ పార్సిల్ లో 7.4 కోట్ల విలువ చేసే హెరాయిన్ డ్రగ్స్ గుర్తించారు కస్టమ్స్ అధికారులు. ఢిల్లీ లోని గుర్గావ్ అడ్రస్ కు పార్సిల్ వచ్చినట్లు గుర్తించారు అధికారులు. పార్సిల్ అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీలు చేసిన కస్టమ్స్ అధికారులు… పార్సిల్ ను అత్యాధునిక పరికరాలతో స్కానింగ్ చేయగా అందులో నిషేధిత డ్రగ్స్ బయటపడింది. చేతికి వేసుకునే గాజులలో డ్రగ్స్ ను నింపిన కేటుగాళ్లు……
దేశంలో అడ్డూ-అదుపూ లేకుండా పెరిగిపోతున్న ఇంధన ధరలపై రైతు సంఘాలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి. పెట్రోల్, డీజిల్‌తో పాటు వంట గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ ఈ నెల 8న దేశ వ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చాయి. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా నిరసన తెలపనున్నారు రైతులు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిరసన ప్రదర్శనలు జరుగుతాయి. ఖాళీ గ్యాస్ సిలెండర్లతో నిరసన తెలపాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఢిల్లీ సరిహద్దు ప్రాంతమైన సింఘూ…
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా డ్రగ్స్ (హెరాయిన్) పట్టుబడింది. కాబూల్ నుండి ఢిల్లీ వచ్చిన ఆఫ్గన్ ప్రయాణీకుడి నుండి 2.4 కోట్ల విలువ చేసే 355 గ్రాముల మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా మాదకద్రవ్యాలను సినీ పక్కీలో తరలించే యత్నం చేశాడు ఆ కేటుగాడు. మాదక ద్రవ్యాలను కస్టమ్స్ అధికారులు కనిపెట్టకుండా కారు ఇంజన్ లో వాడే పరికరాలలో దాచాడు. read also : తెలకపల్లి రవి…
పంజాబ్ రాష్ట్రానికి వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. పంజాబ్‌లో జరిగే ఎన్నికలపై ఆప్ పార్టీ దృష్టిసారించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఛండీగడ్‌లో పర్యటించారు. పార్టీ నాయకులతో చర్చించారు. పంజాబ్ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తే 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ అని ముందుగా ప్రకటించారు. Read: 60 ఏళ్ళ ‘బాటసారి’ అయితే, నిన్నటి రోజున కేజ్రీవాల్ సడెన్ సప్రైజ్ ఇస్తూ, 200 యూనిట్లు కాదు 300 వరకు కరెంట్…
వచ్చే ఏడాది పంజాబ్ రాష్ట్రానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో తన ముద్రవేయాలని అప్ పార్టీ చూస్తున్నది. ఇందులో భాగంగా పంజాబ్‌లో ఆప్ విజయం సాధించి అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్‌ను అందిస్తామని ప్రకటించింది. చంఢీగ్ పర్యటనకు ఒకరోజు ముందుగా ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో పంజాప్ ఆప్ కేడర్ మరింత ఉత్సాహంగా మారింది. పంజాబ్ లో అధికారంలోకి వస్తే 200 యూనిట్ల లోపు వినియోగించేవారికి ఉచితంగా విద్యత్…
వేల మంది చిన్నారుల్లో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధి ఆ చిన్నారికి వచ్చింది. ఈ వ్యాధి ట్రీట్మెంట్ కు ఒక ఇంజెక్షన్అవసరం. భారత్‌లో దొరకని ఆ ఇంజెక్షన్ ను అమెరికా నుంచి తెప్పించాలంటే 16 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుంది. కానీ, చిన్నారి తల్లిదండ్రులకు అంతటి స్తోమత లేదు. అనుకొని విధంగా అదృష్టం వరించింది… ఇంజెక్షన్ ఉచితంగా పొంది పాపకు ఇంజెక్షన్ వేయించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. స్పైనల్ మస్క్యులర్ అట్రాఫీ.. చిన్నపిల్లల్లో కనిపించే ఓ జన్యు…
ఇప్పటికే దేశంలో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి. పెట్రోల్ ధరలు సెంచరీ దాటినా ధరల పరుగులు మాత్రం ఆగడంలేదు. ఇక డీజిల్ కూడా సెంచరీకి సిద్దమవుతుంది. తాజా పెంపుతో సెంచరీదాటిన పెట్రోల్ రాష్ట్రాల్లో తమిళనాడు కూడా చేరిపోయింది. ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్‌కు 36 పైసలు.. డీజిల్ ధర 26 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.32 కాగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.70 కు చేరింది. ఢిల్లీలో…
కరోనా సెకండ్ వేవ్ ఇంకా కలవరపెడుతూనే ఉంది.. కేసులు తగ్గుతున్నా కొత్త కొత్త వేరియంట్లు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.. తాజాగా డెల్టా ప్లస్ వేరియంట్.. బయటపడింది.. ఇప్పటికే భారత్‌లో ఆరు, ఏడు రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగుచూడగా.. ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ తొలి కేసు నమోదైంది.. ఏప్రిల్ నెలలోనే కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్న తిరుపతికి చెందిన బాధితుడు డెల్టా ప్లస్ వేరియంట్‌గా తేలింది.. పుణెలోని సీసీఎంబీలో నిర్వహించిన పరీక్షల్లో డెల్టా ప్లస్ వేరియంట్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిపారు…
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వివిధ కమిటీల నియమాకంపై అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.. ప్రచారాలు జోరుగా సాగుతున్నా.. రేపో, మాపో అంటూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం ఊరిస్తూనే ఉంది.. తాజా పరిణామాలు చూస్తుంటే.. లిస్ట్ ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది.. తెలంగాణలో కాంగ్రెస్ బాధ్యుల నియామకానికి అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునీతా మోగ్లి ముదిరాజ్‌ను నియమించింది అధిష్టానం.. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి…
తెలుగు తేజం, ప్రఖ్యాత వెయిట్ లిఫ్టర్, పద్మశ్రీ కరణం మల్లేశ్వరికి ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా నియమించింది ప్రభుత్వం.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాజధాని ఢిల్లీలో తొలిసారి స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది ఆ రాష్ట్ర సర్కార్… ఆ వర్సిటీ తొలి వీసీగా కరణం మల్లేశ్వరికి అవకాశం దక్కింది.. ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఫస్ట్ వైస్ ఛాన్సలర్‌గా ఏపీకి చెందిన ప్రఖ్యాత వెయిట్ లిఫ్టర్, పద్మశ్రీ కరణం మల్లీశ్వరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది…