ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది… ప్రతిపక్ష నేతలు, సీనియర్ జర్నలిస్టులు, ప్రముఖులతో పాటు.. కేంద్ర మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్‌కు గురికాడంతో ప్రభుత్వంపై విమర్శలు పెరిగాయి.. ఈ వ్యవహారంపై స్పందించిన సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క.. దేశంలో భావ స్వేచ్ఛ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఫోన్లు ట్యాప్ చేస్తూ.. అభద్రతకు గురిచేస్తున్నారన్న ఆయన.. పెగాసస్ స్పైవేర్ ను ప్రభుత్వాలకు మాత్రమే అమ్ముతారని.. రాహుల్ గాంధీ, ఆయన కార్యాలయంలోని సిబ్బంది ఫోన్లు కూడా…
ఇవాళ్టి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈరోజు నుంచి ఆగస్టు 13 వరకు ఈ సమావేశాలు జరగబోతున్నాయి. మొత్తం 20 రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీల సభ్యులు పార్లమెంటు ఉభయసభలలో చాలా కఠినమైన, పదునైన ప్రశ్నలను అడగాలని కోరుకుంటున్నానని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తుందని చెప్పిన మోడీ… ప్రజల నమ్మకాన్ని బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు. అలాగే…
సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో… అన్ని పార్టీలు వ్యూహరచనలో మునిగిపోయాయి.. అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని, ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తారని.. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ.. పాత, కొత్త కేంద్ర మంత్రులకు సూచనలు చేయగా.. మరోవైపు ప్రతిపక్షాలు కూడా సమస్యలను లేవనెత్తేందుకు సిద్ధం అవుతున్నాయి.. అందులో భాగంగా.. రేపు సాయంత్రం 6 గంటలకు సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ఎంపీల సమావేశం జరగనుంది.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై…
సీనియర్ పొలిటిషన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు.. సుమారు 50 నిమిషాల పాటు ఇద్దరి మధ్య చర్చలు జరగడంతో.. ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.. సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాల కాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. సమావేశాలు సజావుగా సాగడానికి అధికారపక్షం ప్రతిపక్ష నేతలతో సంప్రదింపులు జరుపుతూ వస్తోంది.. దానిలో భాగంగానే మోడీ-పవార్ భేటీ జరిగినట్టు చెబుతున్నారు.. ఇక, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయల్ కూడా…
పెట్రో ధరలు వరుసగా పెరిగిపోతూనే ఉన్నాయి… పెట్రో భారం ప్రత్యక్ష, పరోక్షంగా ప్రజల నడ్డి విరిస్తూనే ఉంది.. రోజువారీ సమీక్షలో భాగంగా ఇవాళ దేశీయ చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై 30 పైసలు పెంచేశాయి.. దీంతో.. ఢిల్లీలో లీటర్ ప్రెటోల్ ధర రూ.101.84కి చేరగా.. డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధానిలో లీటర్ డీజిల్ ధర రూ.89.87గా ఉంది.. 75 రోజుల్లో 41వ సారి పెట్రో ధరలను వడ్డించాయి చమురు సంస్థలు.. ఢిల్లీ, ముంబై, చెన్నై,…
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం తరువాత ముఖ్యమంత్రి మమత బెనర్జీ దూకుడు పెంచారు. రాబోయో ఎన్నికల్లో మోడీ సారథ్యంలోని బీజేపీకి చెక్ పెట్టేందుకు ప్రతిపక్షాలన్ని ఏకం అవుతున్నాయి. ఇటీవలే శరద్‌పవార్ ఇంట్లో ప్రతిపక్ష పార్టీలు సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశం తరువాత బీజేపీకి చెక్ పెట్టేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు మమత బెనర్జీ. ఈనెల 25 వ తేదీన ఆమె ఢిల్లీ వెళ్లనున్నారు. నాలుగురోజుల పాటు ఆమె ఢిల్లీలోనే ఉండి కీలక నేతలతో…
కరోనా మహమ్మారితో స్కూళ్లు, విద్యాసంస్థలు అన్నీ మూతపడ్డాయి.. విద్యార్థులు ఆన్లైన్ పాఠాలకే పరిమితం అయ్యారు.. ఇప్పటికీ కరోనా సెకండ్ వేవ్ పూర్తిగా అదుపులోకి రాకపోగా.. మరోవైపు థర్డ్ వేవ్ హెచ్చరికలు భయపెడుతున్నాయి.. దీంతో.. ఇప్పట్లో విద్యార్థులు స్కూల్‌కు వెళ్లే పరిస్థితి కనిపించడంలేదు.. కొన్ని రాష్ట్రాలకు క్లాసుల నిర్వహణకు సిద్ధం అయినా.. థర్డ్ వేవ్ వార్నింగ్‌లతో వెనక్కి తగ్గారు.. అయితే, ఇప్పట్లో భౌతికంగా తరగతులు నిర్వహించలేమని స్పష్టం చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. కరోనా థర్డ్ వేవ్…
రాహుల్ గాంధీ.. త్వరలోనే కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవి చేపడతారంటూ ఎప్పటి నుంచో ప్రచారం సాగుతోంది.. అయితే, ఆ బాధ్యతలను ప్రస్తుతానికి సోనియా గాంధీ చూస్తున్నారు.. సార్వత్రిక ఎన్నికల తర్వాత అనూహ్యంగా రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ బాధ్యతల నుంచి తప్పుకున్నా.. వ్యవహారాలను చక్కబెట్టడంలో కీలకంగా వ్యవహరిస్తూనే ఉన్నారు.. ఇక, ఆయనను కాంగ్రెస్ అధ్యక్ష పీఠంపై కూర్చొబెట్టడం ఖాయమనే ప్రచారం జరుగుతోన్న తరుణంలో.. అధ్యక్ష బాధ్యతల కంటే ముందుగా మరో కీలక పదవి కట్టబెట్టడానికి అధిష్ఠానం రెడీ అయినట్టు…
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచేది ఈటల రాజేందరేనని.. దానికి సంబంధించిన సర్వే నివేదికలు కూడా వచ్చాయని తెలిపారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. ఢిల్లీలో ఇవాళ కేంద్రమంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయ్యారు.. 15 నిమిషాల పాటు సమావేశం జరిగింది.. అనంతరం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. బీజేపీలో ఈటల రాజేందర్ చేరిన రోజే అమిత్ షాను కలవాలని అనుకున్నాం.. అప్పుడు కుదరలేదు కాబట్టి సమయం తీసుకుని ఈ రోజు వచ్చి…
తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరాలని అమిత్‌షా అన్నారు.. ఇందుకోసం ఎన్ని సార్లైనా తెలంగాణ వస్తానని తెలిపారు ఈటల రాజేందర్.. అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతల భేటీ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఈటల.. షాను కలిసి రాష్ట్ర పరిస్థితులు వివరించామని.. రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరాలని ఆయన అన్నారని.. ఇందుకోసం ఎన్నిసార్లు అయినా తెలంగాణ వస్తా అన్నారని వెల్లడించారు.. ఇక, ఎవరు ఎంత డబ్బు ఖర్చు చేసినా గెలిచేది బీజేపీయేనని ధీమా వ్యక్తం చేసిన…