విశాఖ ఉక్కు ఉద్యమం నానాటికి తీవ్ర రూపు దాలుస్తోంది. రాష్ట్రంలో ఆందోళనలు చేసినా, కేంద్రం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో… ఆందోళనలను ఢిల్లీకి చేర్చారు కార్మిక సంఘాల నాయకులు. ఢిల్లీలో వివిధ పార్టీల నేతలను కలుస్తూ, మద్దతు కూడగడుతున్నారు. ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ బయలుదేరిన వేలాదిమంది కార్మికులు… హస్తినలోనే అమీతుమీ తేల్చుకుంటామంటున్నారు. ఎవరో ఇస్తే విశాఖ ఉక్కు రాలేదని. 32 మంది అమరవీరుల త్యాగఫలమని, 64 గ్రామాలు, 26 వేల ఎకరాల భూమిని త్యాగం చేసిన తర్వాతే కల సాకారమైందన్నారు కార్మిక సంఘాల నేతలు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ప్రాణ త్యాగాలక్తెనా సిద్దమని హెచ్చరిస్తున్నారు. రేపు , ఎల్లుండి .. రెండు రోజుల పాటు జంతర్‌మంతర్ దగ్గర మహాధర్నాకు హాజరవుతారు కార్మిక సంఘాలు, వాటి ప్రతినిధులు తెలుగు ప్రజల ఉద్యమస్పూర్తిని చాటిచెబుతామంటున్నారు.