వారిద్దరిదీ ఒకే గ్రామం… కాకపోతే వేరువేరు కులాలు. మనసులు కలవడంతో ప్రేమించుకున్నారు. గ్రామం నుంచి ఢిల్లి వెళ్లి పెళ్లిచేసుకున్నారు. ఏడాది కాలంగా ఢిల్లీలోనే ఉండిపోయారు. అయితే, యువతి గర్భం దాల్చడంతో ఇద్దరూ సొంత గ్రామానికి తిరిగి వచ్చారు. గ్రామంలోకి తిరిగి వచ్చిన వీరికి ఊహించని బహుమానం లభించింది. గ్రామంలోకి అడుగుపెట్టాలంటే పంచాయతీకి రెండున్నర లక్షల రూపాయల జరిమానా కట్టాలని, జరిమానా కట్టకుంటే గ్రామంలోకి అడుగు పెట్టనివ్వమని పంచాయతీ పెద్దలు తీర్పు ఇచ్చారు. యువకుడు లడ్డూసింగ్ తండ్రి యువతి సోని తండ్రితో ఈ విధంగా బాండ్ రాయించుకున్నారు. గ్రామంలోకి అడుగుపెట్టిన వీరికి ఊహించని పరిణామం ఎదురుకావడంతో ఆ జంట షాక్ అయింది. వెంటనే ఆ జంట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు చట్టబద్దమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. బీహార్‌లోని పునియా ప్రాంతంలోని చంపానగర్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది.
Read: ఇండియాలో “ఎఫ్9” ఎప్పుడంటే ?