కరోనా మహమ్మారికి చెక్ పెట్టాలంటే వ్యాక్సిన్ వేయాల్సింది.. ఇప్పటి వరకు 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. 18 ఏళ్లు దిగువన ఉన్న చిన్నారులకు మాత్రం ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు.. అయితే, ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ మాత్రం జరుగుతున్నాయి.. చిన్నారులకు వ్యాక్సిన్‌పై స్పందించిన ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా.. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి చిన్నారులకు కూడా కోవాగ్జిన్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు… రెండేళ్లు పైబడిన చిన్నారులకు ఆ వ్యాక్సిన్ వేసుకోవచ్చు అన్నారు.. ఇప్పటికే…
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు.. ఈ సమావేశంలో బుగ్గనతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ పాల్గొనగా… రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి బుగ్గన.. రాష్ట్రానికి రావాల్సిన నిధుల పై కేంద్ర ఆర్థిక మంత్రితో చర్చించాం అన్నారు.. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయానికి కేంద్ర ఆమోదం ప్రోగ్రెస్ లో…
ఢిల్లీ వేదికగా ఇవాళ ఎన్సీపీ అధినేత, రాజకీయ దిగ్గజం శరద్ పవార్‌తో ఎన్నికల వ్యూహకర్త ప్రకాశం కిషోర్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది… ఇంతకుముందే ఈ ఇద్దరు చర్చలు జరపడం హాట్ టాపిక్ కాగా.. ఇవాళ మరోసారి సమావేశమయ్యారు.. ప్రాంతీయ పార్టీలతో ‘థర్డ్ ఫ్రంట్’పైనే సమాలోచనలు జరిగినట్టు ప్రచారం సాగుతోంది.. “జాతీయ కూటమి” ఏర్పాటుకు ఎలా ముందుకు సాగాలి అనే దానిపై ఫోకస్ పెట్టారు.. మొత్తానికి బీజేపీకి ప్రత్యామ్నాయంగా బలమైన కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం అయినట్టు…
కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు మరో కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉందని.. మా బాధ ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కావడం లేదని తెలిపారు. ఇప్పటి వరకు కోర్ కమిటీ సమావేశం లేదు.. ఎలాంటి చర్చ లేదని… ఇలా అయితే పార్టీ పరిస్థితి ఏంటని హనుమంతరావు పేర్కొన్నారు. కర్ణాటకలో పీసీసీ అంశం వివాదం అయితే పరిశీలకుడిగా మధుసూదన్ మిస్త్రీని పంపించారని… ఇక్కడ మాణిక్కం ఠాగూర్ తీసుకున్న నిర్ణయమే ఫైనలా…
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలో నిత్యం రద్దీగా ఉండే షాహెన్‌బాగ్ ఫైఓవర్కు మంటలు అంటుకున్నాయి. మంటలు అంటుకొని క్షణాల్లో పెద్దవిగా మారాయి. వెంటనే స్పందించిన ప్రజలు ఫైర్ డిపార్ట్మెంట్కు సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్లలో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఢిల్లీ, నోయిడా మార్గంలో ఈ ఫైఓవర్ ఉండటం, నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో పోలీసులు వాహనాలను దారిమళ్లించడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. అయితే, మంటలు అంటుకోవడానికి గల కారణాలు ఏంటి అనే దానిపై…
బాబాయ్, అబ్బాయ్ మధ్య తలెత్తిన విబేధాలు లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)లో తారాస్థాయి చేరుకున్నాయి.. కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత రాంవిలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌ను ఎల్జేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించే విధంగా అతడి బాబాయ్, ఎంపీ పశుపతి కుమార్ పరాస్ పావులు కదిపారు.. ఆ పార్టీకి సంబంధించిన ఎంపీలు.. లోక్‌సభ స్పీకర్‌ను కలిసి.. తమ నేత పరాస్ అని విన్నవించారు.. ఇక, ఆ తర్వాత బాబాయ్, అబ్బాయి మధ్య మాటల యుద్ధమే…
దేశరాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి ఎయిమ్స్‌లోని తొమ్మిదవ అంతస్తులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 22 ఫైర్ టెండర్స్ తో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తొమ్మిదవ అంతస్తులో డయాగ్నోస్టిక్ ల్యాబ్‌లు, పరీక్షా విభాగాలు ఉన్నాయని, కొవిడ్ 19 నమూనాలను సేకరించిన ప్రాంతంలో మంటలు చెలరేగినట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే, ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.
ఈటల బృందానికి ప్రమాదం తప్పింది. ఈటల రాజేందర్ ఢిల్లీ నుండి వస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే ఫైలెట్ అలెర్ట్ అవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. సమస్యను గుర్తించిన ఫైలెట్ చాకచక్యంగా వ్యవహరించారు. దీంతో అందరూ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ విమానంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘనందన్, వివేక్, ఏనుగు రవీందర్ రెడ్డి,తుల ఉమాతో పాటు మొత్తం 184 మంది ఉన్నట్లు సమాచారం. ఇక ఈ ఘటన అనంతరం ఢిల్లీ నుండి…
వైసీపీ రెబల్ నేత, ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం ఇంకా హాట్ టిపిక్‌గానే సాగుతోంది.. ప్రభుత్వంపై ఆరోపణలు, కేసులు, అరెస్ట్, జైలు, ఆస్పత్రి, బెయిల్, ఫిర్యాదులు.. ఇలా కొనసాగుతూనే ఉంది.. ఇక, కాసేపటి క్రితమే లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాతో సమావేశమయ్యారు ఎంపీ రఘురామకృష్ణరాజు… తనపై దాడి విషయంలో.. ప్రివిలేజ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసిన ఆయన.. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.. ఇక, వైసీపీ వెబ్సైట్లో తన పేరును తొలగించడాన్ని ఎంపీ రఘురామ ప్రస్తావించారు.…
డ్రగ్స్ రవాణాలో ఇప్పుడు ఏకంగా విమానాలను ఉపయోగిస్తున్నారు కేటుగాళ్లు.. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం మరో సారి భారీగా డ్రగ్స్ పట్టివేశారు.. డర్బన్ నుండి ఢిల్లీ వచ్చిన టాంజానియా దేశస్తుడి నుండి 28 కోట్ల విలువ చేసే హెరాయిన్ ను గుర్తించారు కస్టమ్స్ అధికారులు.. హెరాయిన్ డ్రగ్‌ను హాండ్ బ్యాగ్, ట్రాలీ బ్యాగ్ లో ప్రత్యేకంగా రంద్రాలు చేసి అందులో నింపాడు కేటుగాడు. ఢిల్లీ విమనాశ్రయంలో ప్రయాణికుడిపై అనుమానం వచ్చి అతని లగేజ్ బ్యాగ్‌ను క్షుణంగా తనిఖీ చేసింది…