పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన వరదసాయంపై ఆమె ప్రధానితో చర్చించబోతున్నారు. అనంతరం, రేపు మమతా బెనర్జీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అవుతారు. దేశంలో నెలకొన్న పరిస్థితులు, బీజేపీకి ప్రత్యామ్నాయంగా ప్రతిపక్షాలను ఒక్కటి చేసేందుకు తీసుకుంటున్న చర్యలు, కార్యచరణ తదితర విషయాల గురించి సోనియాగాంధీతో చర్చించే అవకాశం ఉన్నది. ప్రతిపక్షాలలోని కీలక నేతలతో మమతా బెనర్జీ భేటీలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
Read: సంక్రాంతి బరిలో పవన్ – రానా సినిమా
వచ్చే ఎన్నికల సమయానికి ప్రతిపక్షాలన్నింటిని ఒక్కతాటిపైకి తీసుకొచ్చి బీజేపీని బలంగా ఢీకొట్టాలని చూస్తున్నారు. బెంగాల్‌లో అనుసరించిన వ్యూహాన్ని దేశంలోని మిగతా ప్రాంతాల్లో కూడా అమలుచేసి బీజేపీని దెబ్బకొట్టాలని మమతా బెనర్జీ ప్లాన్. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసినా కాంగ్రెస్ సహకారం లేకుండా బీజేపీని పూర్తిస్థాయిలో ఓడించడం కష్టం అవుతుంది. ఈ విషయంపై చర్చించేందుకే మమతా బెనర్జీ రేపు సోనియా గాంధీతో భేటీ కానున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.