తెలంగాణ బీజేపీలో వలస నేతల ఢిల్లీ టూర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎదుటి వారిని నమ్మించడానికి ‘ఒట్టేసి’ చెబుతారు కొందరు. మరికొన్నిచోట్ల ఇష్టదైవాలపై ప్రమాణాలు చేయిస్తారు. ఒట్లు.. ప్రమాణాలు లేకపోయినా.. ఇటీవల కాలంలో ఆ జాతీయ పార్టీ నాయకుల ఢిల్లీ ప్రయాణం ఇంచుమించు అలాగే ఉందట. పైగా కీలక నేతలు ఎస్కార్ట్‌గా వెళ్లడం ఆసక్తి కలిగిస్తోంది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.
బీజేపీ నుంచి నేతలు వెళ్లిపోకుండా ‘ఢిల్లీ టూర్’!
Also Read
తెలంగాణ బీజేపీలో రెండేళ్లుగా వివిధ పార్టీల నుంచి మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పెద్దసంఖ్యలో చేరారు. ఇటీవల ఆ చేరికలు నెమ్మదించాయి. కానీ.. వలస వచ్చిన నేతలు.. గుడ్‌బై చెబుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు మాజీ మంత్రులు.. ఒక మాజీ ఎమ్మెల్యే బీజేపీకి రాంరాం చెప్పారు. ఇలా ఒక్కొక్కరుగా కాషాయ శిబిరం నుంచి చేజారిపోతుండటంతో కమలనాథులు అలర్ట్ అయ్యారు. బీజేపీ నుంచి వెళ్లేవారివల్ల పార్టీకి నష్టమా.. లాభమా అనేది పక్కన పెడితే.. జరుగుతున్న పరిణామాలు రాంగ్ సిగ్నల్ పంపుతాయని నాయకులు కలవరం చెందారట. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఈ అంశంపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఆ తర్వాత పరిస్థితిని చక్కదిద్దేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు తీసుకున్న చర్యలే ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి.
ప్రచారంలో ఉన్నవారితో బండి సంజయ్ అండ్ టీమ్ మాట్లాడిందా?
బీజేపీలోని వలస నాయకులపై టీఆర్‌ఎస్, కాంగ్రెస్ గురిపెట్టాయి. కొన్ని పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. వారు వెళ్తారో లేదో కానీ.. బండి సంజయ్ అంట్ టీమ్ గత రెండేళ్లుగా పార్టీలో చేరిన వారితో మాట్లాడటం మొదలుపెట్టింది. ముఖ్యంగా యువనేత వీరేంద్రగౌడ్ ఇంటికి రేవంత్, మధుయాష్కీలు వెళ్లి మాట్లాడిన తర్వాత.. బీజేపీలో పరిస్థితిని చక్క దిద్దేందుకు వేగంగా పావులు కదిపినట్టు తెలుస్తోంది. రేవంత్‌తో భేటీ తర్వాత వీరేంద్రగౌడ్.. నేరుగా ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసివచ్చారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌లతో ప్రత్యేకంగా మాట్లాడారు కూడా. ఆ విధంగా తాను పార్టీ మారడం లేదన్న సంకేతాలు పంపించారు వీరేంద్రగౌడ్.
వలస నేతలను తీసుకుని ఢిల్లీ వెళ్తున్న కమలనాథులు
ఎవరిపేర్లు అయితే సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయో.. వారిని తీసుకుని బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లడం మొదలుపెట్టారు. పెద్దిరెడ్డితోపాటు పార్టీని వీడతారని అనుకున్న మాజీ ఎంపీ చాడా సురేష్‌రెడ్డి..మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌లను వెంటబెట్టుకుని ఢిల్లీ వెళ్లారు రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్. మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, శేరిలింగంపల్లి నాయకుడు రవియాదవ్‌లు కూడా ఢిల్లీలో ప్రత్యక్షం అయ్యారు. బీజేపీ ఎంపీ ఒకరు వారిని హస్తినలో పార్టీ పెద్దలతో మాట్లాడించారు. మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ కుమారుడు విక్రంగౌడ్‌ను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఢిల్లీ తీసుకెళ్లారు. పార్టీ మారడం లేదని క్లారిటీ ఇవ్వడం ఒక అంశమైతే.. ఢిల్లీ పెద్దలతో మాట్లాడిస్తే.. వలస నేతలు ధైర్యంగా ఉంటారనే లెక్కలు ఈ టూర్ల వెనక ఉన్నాయట. ఒట్టు వేయించుకోవడం.. ప్రమాణాలు చేయించుకోవడం తప్ప నమ్మకం కుదిర్చేలా చేతులు కలిపి ఢిల్లీ నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్నారట.
బీజేపీలో ఒక్కసారిగా వలస నేతలకు గుర్తింపు!
మొత్తానికి బీజేపీ నుంచి కొందరు వెళ్లిపోవడం వల్ల.. పార్టీలో ఎలాంటి పదవులు లేక.. గుర్తింపు లభించక ఉస్సూరుమంటున్న వలస నేతలపై ఒక్కసారిగా కమలనాథులు ఫోకస్ పెట్టారు. అయితే ఇక్కడ ఇంకో చర్చ కూడా జరుగుతోంది. పార్టీ మారుతున్నారని జరుగుతోన్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టడానికి ఢిల్లీ వెళ్లారా లేక తమ అసంతృప్తిని తెలపడానికి ఈ టూర్‌ను ఉపయోగించుకున్నారా అన్నది ప్రశ్నగానే ఉందట.
తాజావార్తలు
-
Preity Mukhundhan: ఈ ముద్దుగుమ్మ రామానుజన్ మునిమనవరాలా? అసలు నిజం ఇదే!
-
Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్‌కు ముహూర్తం ఖరారు..
-
Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
-
Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
-
Amit Shah: ‘చికెన్ నెక్’ కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!